వివాహిత మహిళపై కానిస్టేబుల్ అత్యాచారం

వివాహిత మహిళపై కానిస్టేబుల్ అత్యాచారం

case registered on constable, due to harassment on married woman : సమాజంలో మహిళలకు కష్టం వస్తే కాపాడాల్సి పోలీసే మహిళను అక్రమ సంబంధం పెట్టుకోమని బెదిరించటం మొదలెట్టాడు. కంచె చేను మేసిన చందంగా మారేసరికి బాధితురాలు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. ఇంటిపక్కన ఉండే వివాహిత మహిళపై అత్యాచారానికి ఒడి గట్టిన పోలీసు కానిస్టేబుల్ ఉదంతం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.

సైదాబాద్ రెడ్డి బస్తీలో నివసించే గిరిజన మహిళ కుటుంబం మూడేళ్ల క్రితం పూసలబస్తీలో నివసించేవారు. అక్కడ పక్కింట్లో మాదన్నపేటలో కానిస్టేబుల్ గా పని చేసే పి.వెంకటేశ్వర్లు కుటుంబం నివసించేది. ఇరుకుటుంబాల వారు సఖ్యంగా ఉండేవారు.

ఇది అలుసుగా తీసుకుని వెంకటేశ్వర్లు గిరిజిన మహిళపై కన్నేశాడు. ఆమెతో అసభ్యంగా మాట్లాడేవాడు. బాధితురాలిని వివాహేతర సంబంధం పెట్టుకోమని బలవంతం పెట్టి వేధించేవాడు. కొన్ని సార్లు బెదిరింపులకు గురిచేశాడు. ఇది భరించలేని బాధితురాలు విషయాన్ని భర్తకు చెప్పింది.

ఇది మంచి పని కాదని ఆమె భర్త కానిస్టేబుల్ ను వారించాడు. అయినా వెనక్కి తగ్గని కానిస్టేబుల్ ఒకరోజు ఆమె భర్త సమక్షంలోనే అమెను అసభ్యంగా దూషించటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దీంతో కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న కానిస్టేబులు తిరిగి ఇటీవల వేధింపులు ప్రారంభించాడు.

జనవరి 25న   కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు  బాధితురాలి ఇంటికి వెళ్ళి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దీంతో జనవరి 26న బాధితురాలు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.