CBI Raids: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంటిపై సీబీఐ దాడులు.. మండిపడ్డ కేజ్రీవాల్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంటిపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు సోదాలు చేస్తున్నారు. అలాగే, ఢిల్లీలోని 20 ప్రాంతాల్లో సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులోనే సీబీఐ అధికారులు దాడులు చేస్తున్నారు. దీనిపై మనీశ్ సిసోడియా ట్విటర్ ద్వారా స్పందించారు. ''మా ఇంటి వద్ద సీబీఐ అధికారులు ఉన్నారు. నేను వారి విచారణకు సహకరిస్తాను. నాకు వ్యతిరేకంగా వారు ఏమీ గుర్తించలేరు'' అని పేర్కొన్నారు.

CBI Raids: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంటిపై సీబీఐ దాడులు.. మండిపడ్డ కేజ్రీవాల్

CBI Raids

CBI Raids: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంటిపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు సోదాలు చేస్తున్నారు. అలాగే, ఢిల్లీలోని 20 ప్రాంతాల్లో సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులోనే సీబీఐ అధికారులు దాడులు చేస్తున్నారు. దీనిపై మనీశ్ సిసోడియా ట్విటర్ ద్వారా స్పందించారు. ”మా ఇంటి వద్ద సీబీఐ అధికారులు ఉన్నారు. నేను వారి విచారణకు సహకరిస్తాను. నాకు వ్యతిరేకంగా వారు ఏమీ గుర్తించలేరు” అని పేర్కొన్నారు.

సీబీఐ దాడులపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ”సీబీఐని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పూర్తి సహకారం అందిస్తాం. ఇంతకు ముందు కూడా దాడులు జరిగాయి. కానీ, ఏమీ గుర్తించలేపోయారు. ఇప్పుడు కూడా వారికి ఏమీ లభించదు” అని అన్నారు. ఇప్పటికే మరో కేసులో ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ను న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మ‌నీశ్ సిసోడియాను కూడా కేంద్ర ప్ర‌భుత్వం అరెస్టు చేయించే అవ‌కాశం ఉంద‌ని అర‌వింద్ కేజ్రీవాల్ కొన్ని రోజులుగా ఆరోపిస్తున్నారు.

మ‌నీశ్ సిసోడియాను అవినీతి కేసులో అరెస్టు చేయించాలని కేంద్ర స‌ర్కారు ప్ర‌ణాళిక వేసుకుంద‌ని ఆయన ఇంతకుముందు అన్నారు. ఢిల్లీలో విద్యా రంగంలో మ‌నీశ్ సిసోడియా చేసిన కృషి వ‌ల్ల 18 ల‌క్ష‌ల మంది చిన్నారులు ల‌బ్ధి పొందుతున్నారని ఆయన చెప్పారు. మ‌నీశ్ సిసోడియా అవినీతికి పాల్ప‌డ్డారా..? అటువంటి వ్య‌క్తిని అరెస్టు చేయాలా? అవార్డు ఇవ్వాలా? అని కేజ్రీవాల్ అన్నారు.

China New Mission: చైనా మరో ఎత్తుగడ.. హిందూ మహాసముద్రంలో పట్టు కోసం కుయుక్తులు..