చంద్రబాబు తీరు వల్లే కోడెల ఆత్మహత్య : అంబటి

  • Edited By: chvmurthy , September 17, 2019 / 12:23 PM IST
చంద్రబాబు తీరు వల్లే కోడెల ఆత్మహత్య : అంబటి

చంద్రబాబు తీరు వల్లే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. కోడెల మృతి పట్ల ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయని,  ఉరి వేసుకోటానికి వివిధ కారణాలను టీడీపీ నాయకులే చెపుతున్నారని ఆయన అన్నారు.  సంఘటన  తెలంగాణలో జరిగింది కాబట్టి , పోలీసు విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని ఆయన  తెలిపారు.

చంద్రబాబు నాయుడు  కోడెలను వాడుకున్నంత  కాలం వాడుకుని వదిలేశాడు కాబట్టే సూసైడ్ చేసుకున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. కోడెల మాకు రాజకీయ ప్రత్యర్ధే కానీ వ్యక్తిగత శత్రువు కాదని ఆయన అన్నారు. చంద్రబాబుకే శత్రువుగా మారాడని చంద్రబాబు ఇన్సల్ట్ చేయటంవల్లే కోడెల చనిపోయారని ఆయన అన్నారు. 

కోడెల చనిపోవటానికి ముందు 25 నిమిషాలు ఫోన్లో మాట్లాడారని, అది ఎవరో తేలితే అన్నీ వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు.  నాకు ఆపద వస్తే  నాపార్టీ, నాకుటుంబ సభ్యలు పట్టించుకోనప్పుడు నేనెందుకు బతకాలి అని కోడెల అనుకునే పరిస్ధితి తీసుకువచ్చిందెవరో టీడీపీ శ్రేణులు గుర్తించాలని అంబటి కోరారు.