గొప్ప చదువులు చదివి, అడ్డదారులు తొక్కిన విద్యావంతుడు

  • Published By: murthy ,Published On : December 13, 2020 / 04:28 PM IST
గొప్ప చదువులు చదివి, అడ్డదారులు తొక్కిన విద్యావంతుడు

PhD scholar, customer caught red-handed in mephedrone bust in Hyderabad : కష్టపడి చదువుకుని పీహెచ్ డీ చేసిన వ్యక్తి గౌరవంగా ఉద్యోగం చేసుకుంటే సమాజం అతడిని గౌరవిస్తుంది. కానీ ఈజీగా మనీ సంపాదించాలని చూసి నేరస్ధుడయ్యాడు. కెమిస్ట్రీలో పీహెచ్ డీ చేసిన వ్యక్తి సొంతంగా ల్యాబ్ పెట్టుకుని మాదకద్రవ్యాలు తయారు చేయటం మొదలెట్టాడు. ఈయన గారి బాగోతాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు బయటపెట్టారు.

హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి కెమిస్ట్రీలో పీహెచ్ డీ చేసాడు. కొన్నాళ్లు ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో పని చేశాడు. ఎన్నాళ్లిలా ఉద్యోగం చేస్తాం అనుకున్నాడు. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశ పుట్టింది. డ్రగ్స్ తయారీ విధానాన్ని ఎంచుకున్నాడు. ఇంట్లోనే ల్యాబరేఠరీ సిధ్దం చేసుకున్నాడు. ముంబై డ్రగ్స్ మాఫియా తో లింకు లు పెట్టుకున్నాడు. ఇంట్లోనే మాదక ద్రవ్యాలు తయారు చేసి వారికి సప్లై చేయటం మొదలెట్టాడు.

నిఘా పెట్టిన అధికారులు డిసెంబర్11, శుక్రవారం రూ.63.12 లక్షల విలువైన 3.156 కిలోల మెఫిడ్రిన్‌ను మరో వ్యక్తికి విక్రయిస్తుండగా డీఆర్‌ఐ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. తర్వాత ఆ వ్యక్తి ల్యాబ్‌పై దాడులు చేసి రూ.12.40 లక్షల నగదు, 112 గ్రాముల మెఫిడ్రిన్‌ శాంపిల్స్, 219.5 కిలోల ముడి మెఫిడ్రిన్‌ సరుకును స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన వ్యక్తి భవనం లో డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేయగా గ్రౌండ్ ప్లోర్ లో ఏర్పాటు చేసుకున్న ల్యాబ్ చూసి ఖంగు తిన్నారు. మాదక ద్రవ్యాలు తయారు చేయటానికి అవసరమైన పరికరాలు,సరంజామా అంతా ఏర్పాటు చేసుకున్నాడు. డబ్బు మీద అత్యాశతో ముంబై మాఫియాతో చేతులు కలిపినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటిదాకా ఈ వ్యక్తి రూ. 2కోట్ల విలువైన మెఫిడ్రిన్ విక్రయించినట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి మరోక వ్యక్తిని కూడా అధికారులు అరెస్ట్ చేశారు.