chennai businessman : లంచాలు, మామూళ్లు ఇవ్వలేక పారిశ్రామికవేత్త ఆత్మహత్య

chennai businessman : లంచాలు, మామూళ్లు ఇవ్వలేక పారిశ్రామికవేత్త ఆత్మహత్య

Businessman Commits Suicde

Chennai businessman commits suicide : ఎక్కడో ఎవరి దగ్గరో, ఎవరి కిందో ఉద్యోగం చేసుకోవటం ఎందుకని…. స్వంతకాళ్లమీద నిలబడేందుకు అప్పొసొప్పో చేసివ్యాపారం పెట్టుకుంటే ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు లంచాలు మాముళ్లకోసం వేధించటంతోఒకయువపారిశ్రామికవేత్త ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

చెన్నైలోని ఎన్నూరు శివగామినగర్ కు చెందిన పారిశ్రామిక వేత్త విక్రమ్(30) ఏడాగది క్రితం సూర్య అనే యువతిని వివాహం చేసుకున్నాడు. 2019 లో విక్రమ్ రూ.60లక్షల పెట్టుబడితో మినరల్ వాటర్ ప్లాంట్ వ్యాపారం ప్రారంభించాడు. ఇందుకోసం పలువురి వద్ద రుణాలు తీసుకున్నాడు.

మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వహణలో అతనికి అనేక అవరోధాలు ఎదురయ్యాయి. రెవెన్యూ అధికారులు, విద్యుత్ బోర్డు అధికారులు, ఆరోగ్యశాఖ అధికారులు లంచాల కోసం వేధించసాగారు. దీనికి తోడు ఇటీవల కొందరు స్ధానిక రాజకీయ నాయకులు కూడా మామూళ్లపేరిట వేధించసాగారు.

ఈవిషయాన్ని మార్చి 12న అతని సోదరుడు విఘ్నేశ్వరన్‌ పోలీసులకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. అయినా వారి నుంచి ఎటువంటి స్పందనరాలేదు. దీంతో మనస్తాపం చెందిన విక్రమ్ సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు.