ఫ్రాంక్ షో పేరిట అసభ్య ప్రశ్నలు….యూ ట్యూబ్ నిర్వాహకులు అరెస్ట్

ఫ్రాంక్ షో పేరిట అసభ్య ప్రశ్నలు….యూ ట్యూబ్ నిర్వాహకులు అరెస్ట్

Chennai talks Youtube Channel team arrested for woman’s sex talks video goes viral : టెక్నాలజీ వాడకం సులువయ్యాక, సోషల్ మీడియా సైట్లు అందరికీ అందుబాటులోకి వచ్చి, చాలామంది వెబ్ సైట్లు ప్రారంభించి వాటిద్వారా ఆదాయ మార్గాలు పెంచుకుంటున్నారు. వీటిలో దైవభక్తి, కామెడీ, న్యూస్, ఇలా పలు రంగాలకు చెందిన సైట్లు… యూ ట్యూబ్ చానళ్లు పుట్టుకొచ్చాయి. చెన్నైకు చెందిన ఒక యూట్యూబ్ చానల్ ఫ్రాంక్ షో పేరుతో మహిళలను అసభ్యకరమైన ప్రశ్నలు అడుగుతూ ఇబ్బందులకు గురిచేస్తూండటంతో పోలీసులు యూట్యూబ్ చానల్ నిర్వాహకులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.

చెన్నై టాక్స్   పేరిట నిర్వహింపబడుతున్న యూట్యూబ్ చానల్ నిర్వాహకులు…. ముందుగా తామే ఎంపిక చేసుకున్న ఒక యువతి ద్వారా కొన్ని అశ్లీల ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. ఇవే ప్రశ్నలకు పబ్లిక్ లో మహిళల  నుంచి సమాధానాలు రాబట్టేందుకు చెన్నై నగరంలో కొన్ని ప్రాంతాల్లో వీడియో తీస్తూ మహిళలను అశ్లీల ప్రశ్నలు అడగటం ప్రారంభించారు. బీసెంట్ నగర్ లో  ఫ్రాంక్ షో షూటింగ్ జరుగుతుండగా మహిళలు  వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెంటనే  పోలీసులు రంగంలోకి దిగి కెమెరామెన్ అజయ్ బాబు, యాంకర్ అజీం బాచ్చా, నిర్వాహకులు దినేష్ లను అదుపులోకి తీసుకున్నారు. యూ ట్యూబ్ చానల్ నిండా అసభ్యకరమైన వీడియోలు ఉండటంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఆ చానల్ ను నిషేధించాలని యూట్యూబ్ కు సిఫారస్ చేశారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ ఐపిసి సెక్షన్లు 354 (బి), 294 (బి), 509, 506 (ii), తమిళనాడు మహిళా వేధింపుల చట్టంలోని సెక్షన్ 4 కింద కేసు నమోదు చేశారు.

CRIME