Chennai: ట్రక్కు కింద పడి మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి.. స్కూటీపై నుంచి గుంతలో పడటంతో దారుణం

ఈ ఘటన చెన్నైలోని మదురవోయల్ ప్రాంతంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శోభన అనే యువతి చెన్నైలోని ఒక ప్రైవేటు సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. మంగళవారం తన చిన్న తమ్ముడిని స్కూళ్లో దిగబెట్టేందుకు స్కూటీపై వెళ్తోంది.

Chennai: తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. స్కూటీపై వెళ్తున్న ఒక యువతి గుంతలో పడిపోయింది. అంతలోనే ఆమెపై నుంచి ట్రక్కు వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణించగా, ఆమె తమ్ముడు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Air India flight : విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసిన మందుబాబు, ఏం పర్లేదు డ్రెస్ మార్చుకోమన్న సిబ్బంది

ఈ ఘటన చెన్నైలోని మదురవోయల్ ప్రాంతంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శోభన అనే యువతి చెన్నైలోని ఒక ప్రైవేటు సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. మంగళవారం తన చిన్న తమ్ముడిని స్కూళ్లో దిగబెట్టేందుకు స్కూటీపై వెళ్తోంది. ఈ క్రమంలో రోడ్డుపై గుంత రావడంతో, స్కూటీ ప్రమాదానికి గురైంది. శోభన, ఆమె తమ్ముడు రోడ్డుపై, చెరోవైపు పడిపోయారు. శోభన అదే గుంతలో పడిపోయింది. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ట్రక్కు ఆమెపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో శోభన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె తమ్ముడికి గాయాలయ్యాయి. అతడికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

TSRTC: నేటి నుంచి తెలంగాణలో టీఎస్ఆర్‌టీసీ స్లీపర్ క్లాస్ బస్సు సర్వీసులు ప్రారంభం

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఘటన అనంతరం ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. తర్వాత అతడిని అరెస్ట్ చేశారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి, ఒక యువతి ప్రాణం పోయేందుకు కారణమయ్యాడని అతడిపై కేసు నమోదు చేశారు. కాగా, స్కూటీ నడిపేటప్పుడు శోభన, ఆమె తమ్ముడు ఇద్దరూ హెల్మెట్ పెట్టుకోలేదని పోలీసులు తెలిపారు. హెల్మెట్ ధరించి ఉంటే ఇంతటి ఘోరం జరిగేది కాదని వాళ్లు అన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు