ఐసీయూలో యువతిపై గ్యాంగ్ రేప్, అసలేం జరిగింది

చత్తీస్ ఘడ్ రాష్ట్రం బిలాస్ పూర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ

  • Published By: naveen ,Published On : May 26, 2020 / 07:21 AM IST
ఐసీయూలో యువతిపై గ్యాంగ్ రేప్, అసలేం జరిగింది

చత్తీస్ ఘడ్ రాష్ట్రం బిలాస్ పూర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ

చత్తీస్ ఘడ్ రాష్ట్రం బిలాస్ పూర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ యువతి చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఐసీయూలో తనపై సామూహిక అత్యాచారం జరిగిందని యువతి ఆరోపించింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వార్డు బాయ్స్ తనను గ్యాంగ్ రేప్ చేశారని యువతి చెబుతోంది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. గ్రాడ్యుయేషన్ ఫస్టియర్ చదువుతున్న టీనేజ్ అమ్మాయి ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాట్లాడలేని స్థితిలో ఉన్న యువతి చేతిరాతితో పోలీసులకు కంప్లయింట్ చేసింది. 

ఐసీయూలో వార్డు బాయ్స్ అఘాయిత్యం:
బిలాస్ పూర్ జిల్లా కేంద్రానికి చెందిన యువతి ఇటీవల అనారోగ్యానికి గురైంది. మే 18న బిలాస్ పూర్ లోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో చేరింది. ఆ వెంటనే ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. ఐసీయూలోకి ఎవరినీ అనుమతించకపోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రి బయట నిద్రపోయారు. ఈ క్రమంలో వార్డు బాయ్స్ తనపై అత్యాచారం చేశారని యువతి ఆరోపించింది. అయితే అనారోగ్యంతో ఉన్న కారణంగా యువతి మాట్లాడలేకపోయింది. మే 19న డాక్టర్లు ఆమెను డిశ్చార్జ్ చేశారు. 

పేపర్ పై రాసి తెలిపిన యువతి:
ఇంటికి వచ్చిన తర్వాత యువతి పెన్ను, పేపర్ ఇవ్వాలని తల్లిదండ్రులను అడిగింది. వారు ఇచ్చారు. అందులో తనపై వార్డు బాయ్స్ అఘాయిత్యానికి పాల్పడినట్టు రాసింది. బలాత్కార్, వార్డు బాయ్స్ అనే పదాలు రాసింది. దీంతో షాక్ అయిన కుటుంబసభ్యులు ఆమెను తీసుకుని సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ జరిగింది చెప్పారు. అయితే యువతి నోరు విప్పి మాట్లాడకపోవడంతో పోలీసులు లైట్ తీసుకున్నారు. ఇంతలో యువతి రాసిన లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

రంగంలోకి దిగిన మంత్రి, విచారణకు ఆదేశం:
ఈ సంఘటనను పోలీసులు తొలుత తీవ్రంగా పరిగణనలోకి తీసుకోలేదు. మీడియాలో దీనికి సంబంధించిన వార్తా కథనాలు రావడం ప్రారంభించడంతో రాష్ట్ర ఆరోగ్య మంత్రి టీఎస్ సింగ్ స్పందించారు. హైలెవల్ కమిటీతో విచారణకు ఆదేశిచారు. న్యాయం జరిగేలా చూస్తామన్నారు. స్వయంగా మంత్రి రంగంలోకి దిగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. వైద్య రిపోర్టుల ఆధారంగా విచారణ జరుగుతుందన్నారు.

పోలీసులకు తలనొప్పిగా మారిన కేసు:
కాగా, ఈ కేసు మిస్టరీగా మారింది. పోలీసులకు అనేక అనుమానాలు ఉన్నాయి. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆసుపత్రిలో పని చేసే వార్డు బాయ్స్ అందరిని పిలిపించారు. అందులో అఘాయిత్యానికి పాల్పడిన వారిని గుర్తించాలని యువతిని అడిగారు. అయితే అఘాయిత్యానికి ప్రయత్నించిన వారిలో వారందరూ ఉన్నారని యువతి చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. ప్రస్తుతం ఆమె మానసిక స్థితి సరిగా లేదని, అందుకే ఇలా చెబుతోందని అంచనాకు వచ్చారు. అసలు ఐసీయూలో అత్యాచారం జరిగిందా? లేదా? ఇందులో వాస్తవం ఎంత? యువతి మానసిక స్థితి సరిగా ఉందా? ఇలాంటి విషయాలకు సంబంధించి వైద్యుల నుంచి రిపోర్టులు రావాల్సి ఉంది. అవన్నీ వస్తే కానీ తాము ఓ క్లారిటీకి రాలేమని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ కేసు ఓ మిస్టరీగా మారింది.

Read: ఆర్ధిక ఇబ్బందులతో తల్లీ,కూతురు ఆత్మహత్య