Marijuana seizure case : రూ.10కోట్ల విలువ చేసే 6,545కిలోల గంజాయి స్వాధీనం..నిందితులకు 20 ఏళ్ల జైలుశిక్ష విధించిన కోర్టు

రూ.10కోట్ల విలువ చేసే 6,545కిలోల గంజాయి స్వాధీనం కేసులో ఐదుగురు నిందితులకు 20 ఏళ్ల జైలుశిక్ష విధించిన కోర్టు.

Marijuana seizure case : రూ.10కోట్ల విలువ చేసే 6,545కిలోల గంజాయి స్వాధీనం..నిందితులకు 20 ఏళ్ల జైలుశిక్ష విధించిన కోర్టు

6,545 Kgs of Marijuana seizure case, 5 accused jailed for 20 years

Marijuana seizure case : గంజాయి అక్రమ తరలింపులపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంతగా నిఘా పెట్టినా ఈ మత్తు దందాలు కొనసాగుతునే ఉన్నాయి. తనిఖీలు చేపట్టి అధికారులు ఎప్పటికప్పుడు గంజాయి తరలింపులను అడ్డుకుంటున్నారు. పలు సందర్భాల్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేస్తున్నారు. అలా స్వాధీనం చేసుకున్న ఈ మత్తు మహమ్మారిని అధికారులు కాల్చి దగ్ధం చేస్తుంటారు.

గంజాయి తరలింపులు చేస్తున్న పట్టుబడ్డ నేరస్థులు కోర్టుల వెంట తిరుగుతుంటారు. అలా 2018లో చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో అదిపెద్ద అక్రమ గంజాయి సరఫరా చేస్తుండగా కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు విచారణలు కొనసాగుతుండగా తాజాగా ఈ కేసులో న్యాయస్థాని సంచలన తీర్పునిచ్చింది. నిందితులకు 20ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలనాత్మక తీర్పును వెలువరించింది. భారీగా గంజాయి తరలిస్తుండా పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరిని దోషులుగా నిర్ధారించిన ధర్మాసనం ఐదుగురికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు ..రై.2 లక్షల జరిమానాను విధించింది.

గంజాయి తరలింపులు జరుగుతున్నాయనే పక్కా సమాచారంతో 2018 జూన్ 24న డీఆర్ఐ అధికారులు రాయ్ పూర్ లోని సంతోష్ నగర్ చౌక్ వద్ద కాపు కాసారు. గంజాయితో వెళ్తున్న ఓ ట్రక్కుని ఆపి తనిఖీలు చేశారు. ట్రక్కు నిండా కొబ్బరిబోండాలు ఉన్నాయి. కానీ అధికారులకు అనుమానం వచ్చి మరింత క్షుణ్నంగా తనిఖీలు చేయగా కొబ్బరిబోండాల కింద పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు ఉండటాన్ని గుర్తించారు. దీంతో ఆ ట్రక్కులో ఉన్న ముగ్గురిని అరెస్టు చేశారు. వారిని విచారించగా మరో ఇద్దరి గురించి చెప్పారు. దీంతో గంజాయిని సరఫరా చేస్తున్న మరో ఇద్దరిని పట్టుకుని అరెస్టు చేశారు.

అలా దాదాపు 6,545 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటివిలువ రూ. 9,81,75000 కోట్ల రూపాయలని తెలిపారు. 2018లోనే వీరిపై ఛార్జ్ షీట్ నమోదు చేశారు. 2019 జూన్ లోవీరిపై విచారణ ప్రారంభం కాగా 2023 మార్చి 15న ఎన్డీపీఎస్ కోర్టు తీర్పు వెల్లడించింది.