Wife Kills Husband With Axe : బాబోయ్.. నల్లగా ఉన్నావని వెక్కిరించిన భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య.. మర్మాంగాన్ని కూడా కోసేసింది

ఓ భార్య తన భర్తనే గొడ్డలితో నరికి చంపేసింది. అంతేకాదు అతడి మర్మాంగాన్ని కూడా కోసేసింది. దీనికి కారణం.. భర్త వేధింపులే. అందంగా లేవు, నల్లగా ఉన్నావు అంటూ భర్త వెక్కింరించడం, వేధించడం, ఏడిపించడం తట్టుకోలేకపోయిన ఆ భార్య.. కట్టుకున్న మొగుడు అని కూడా చూడలేదు. అతడిని కడతేర్చింది.

Wife Kills Husband With Axe : బాబోయ్.. నల్లగా ఉన్నావని వెక్కిరించిన భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య.. మర్మాంగాన్ని కూడా కోసేసింది

Wife Kills Husband With Axe : ఓ భార్య తన భర్తనే గొడ్డలితో నరికి చంపేసింది. అంతేకాదు అతడి మర్మాంగాన్ని కూడా కోసేసింది. దీనికి కారణం.. భర్త వేధింపులే. అందంగా లేవు, నల్లగా ఉన్నావు అంటూ భర్త వెక్కింరించడం, వేధించడం, ఏడిపించడం తట్టుకోలేకపోయిన ఆ భార్య.. కట్టుకున్న మొగుడు అని కూడా చూడలేదు. అతడిని కడతేర్చింది. ఈ షాకింగ్ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లాలో జరిగింది.

దుర్గ్ జిల్లా అమలేశ్వర్ గ్రామంలో ఉండే అనంత్ సోన్వానీని అతడి భార్య సంగీత సోన్వానీ హత్య చేసింది. అనంత్ సోన్వానీకి సంగీత రెండో భార్య. మొదటి భార్య చనిపోయిన తర్వాత సంగీతను పెళ్లి చేసుకున్నాడు. తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. భార్యను అందంగా లేవని, నల్లగా ఉన్నావని తరచూ తిడుతుండే వాడు అనంత్ సోన్వానీ. ఆమెని ఏడిపించే వాడు. టార్చర్ పెట్టేవాడు. ఆదివారం రాత్రి కూడా భార్య భర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది.

ఆ సమయంలో అనంత్ మళ్లీ ఆమె శరీర రంగు గురించి తీశాడు. నల్లగా ఉన్నావు అంటూ వెక్కిరించాడు. అసలే కోపంలో ఉంది. ఇక అతడి టార్చర్ తట్టుకోలేకపోయింది. కోపంతో ఊగిపోయిన సంగీత ఇంట్లో ఉన్న గొడ్డలితో భర్తను నరికేసింది. అంతటితో ఆమె కోపం చల్లారలేదు. అతడి మర్మావయవాలను కూడా నరికేసింది. దాంతో, అనంత్ సోన్వానీ స్పాట్ లోనే చనిపోయాడు. ఆ తర్వాత.. తన భర్తను ఎవరో చంపారంటూ స్థానికులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. అయితే ఈ కేసును పలు కోణాల్లో విచారించిన పోలీసుల.. చివరికి భార్యే చంపిందన్న నిజాన్ని రాబట్టారు. అనంతరం నిందితురాలిని అరెస్ట్ చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కట్టుకున్న భర్తను భార్యే కడతేర్చిన ఘటన సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో కొందరు భర్త తీరును తప్పుపడితే మరికొందరు భార్యను తప్పుపడుతున్నారు. ఎదుటి వ్యక్తిని బాడీ షేమింగ్‌ చేయడం కరెక్ట్ కాదంటున్నారు. నల్లగా ఉన్నావంటూ వేధించిన అతడికి తగిన శాస్తి జరిగిందంటున్నారు. అదే సమయంలో ఆమె చేసిన పనిని కొందరు తప్పుపడుతున్నారు. కోపంలో ఉన్నప్పుడు మనిషి ఆలోచనా శక్తిని కోల్పోతాడని, అప్పుడు తీసుకునే నిర్ణయాలు అస్సలు మంచి చేయవని అంటున్నారు.