చిగురుపాటి హత్యలో చిక్కుముడులు – 12

  • Published By: madhu ,Published On : February 7, 2019 / 03:13 PM IST
చిగురుపాటి హత్యలో చిక్కుముడులు – 12

హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసు థ్రిల్లర్‌ని తలపిస్తోంది. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి అని తేల్చినా…లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు ఏపీ పోలీసులు వెల్లడించారు. ఈ కేసును తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే…ఇందులో పలు చిక్కుముడులున్నాయి. 

1. జయరాం దగ్గర రూ. 4.5 కోట్లు లేవా..? బడా వ్యాపారులతో సంబంధాలున్నా.. రాకేశ్‌ దగ్గరే ఎందుకు అప్పు తీసుకున్నాడు..?
2. రాకేశ్‌తో పరిచయం ఎలా..? రాకేశ్‌ ఆర్థిక పరిస్థితి ఏంటి..? అప్పుకు, హత్యకు లింకేంటి..?
3. పరిచయం లేని మహిళ రమ్మంటే ఎలా వెళ్లాడు..?
4. రూ. 6 లక్షలు అరేంజ్‌ చేసింది ఎవరు..? డబ్బు తీసుకున్నది ఎవరు..?
5. గొంతు నులిమి చంపితే.. తలపై గాయం ఎలా అయింది..?
6. శరీరం నల్లగా మారిందనే ఊహాగానాలు..ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ రాకుండానే విషప్రయోగం జరగలేదని పోలీసుల నిర్దారణ. 
7. హత్య చేసింది రాకేశ్‌ ఒక్కడే అయితే.. ఇంకా విచారించాల్సింది ఎవరిని..?
8. హత్య జరిగిన ఇంట్లో ఐదుగురు భోజనం చేసిన ఆనవాళ్లు..! రాకేశ్‌, జయరాం కాకుండా మిగిలిన వారు ఎవరు..?
9. శ్రిఖాకు జయరాం మరణ వార్తను ఫోన్‌ చేసి చెప్పింది ఎవరు..?
10. జయరాం ఇంట్లో ఆస్తి పత్రాల కోసం వెతికిన శ్రిఖా.. ఆమెతో పాటు వెళ్లిన వ్యక్తి ఎవరు..?
11. ఆస్తి పత్రాలు మిస్సయ్యాయా..? శ్రిఖాకు జయరాంకు ఆస్తి తగాదాలు ఉన్నాయా..? రాకేశ్‌కున్న సంబంధం ఏంటి..?
12. అమెరికా పోలీసులు ఎంట్రీ ఇస్తే.. కేసు ఏ మలుపు తీసుకోనుంది..?