వీడియో: కారు చక్రాల కింద నలిగి బాలుడి మృతి

అభంశుభం తెలియని ఆ పసిబాలుడికి అప్పుడే నిండు నూరేళ్లు నిండిపోయాయి. కారు రూపంలో వచ్చిన మృత్యువు ఏడాదిన్నర బాలుడిని కబళిలించివేసింది. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి ఎస్ యూవీ కారు అమాంతం దూసుకెళ్లింది.

  • Edited By: sreehari , January 3, 2019 / 10:56 AM IST
వీడియో: కారు చక్రాల కింద నలిగి బాలుడి మృతి

అభంశుభం తెలియని ఆ పసిబాలుడికి అప్పుడే నిండు నూరేళ్లు నిండిపోయాయి. కారు రూపంలో వచ్చిన మృత్యువు ఏడాదిన్నర బాలుడిని కబళిలించివేసింది. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి ఎస్ యూవీ కారు అమాంతం దూసుకెళ్లింది.

  • ఏడాదిన్నర చిన్నారిపై దూసుకెళ్లిన ఎస్ యూవీ

  • ఉత్తరప్రదేశ్ లో విషాదం.. ఇంటి బయట ఆడుకుంటుండగా ఘటన..   

అభంశుభం తెలియని ఆ పసిబాలుడికి అప్పుడే నిండు నూరేళ్లు నిండిపోయాయి. కారు రూపంలో వచ్చిన మృత్యువు ఏడాదిన్నర బాలుడిని కబళిలించివేసింది. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి ఎస్ యూవీ కారు అమాంతం దూసుకెళ్లింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బాలుడు కారు చక్రాల కింద నలిగి అక్కడిక్కడే మృతిచెందాడు. ఘటన అనంతరం కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ లోని  బరబంకి ప్రాంతంలోని కొట్వాయిలో చోటుచేసుకుంది.

అప్పటివరకూ ఆడుకుంటూ సందడి చేసిన బాబూ విగతజీవిలా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ బిడ్డను బలిగొన్న ఆ కారును ఆగ్రహంతో కుటుంబ సభ్యులు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న సిటీ సీఓ సుశీల్ కుమార్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకొని బాలుడి కుటుంబ సభ్యులకు నచ్చచెప్పారు. బాలుడి మృతికి కారణమైన కారు డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని సింగ్ తెలిపారు. కారు కింద పడి బాలుడు మృతిచెందిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే ఆ వీడియో..