Cyber crime : ప్రియురాలి క‌నురెప్ప‌ల‌తో రూ.18 ల‌క్ష‌లు దోచేసిన ఘనుడు..నాలుగేళ్లు జైలుశిక్ష విధించిన కోర్టు

ప్రియురాలి క‌నురెప్ప‌ల‌తో రూ. 18 ల‌క్ష‌లు దోచేసాడు ప్రియుడు. అతను చేసిన నేరానానికి నాలుగేళ్లు జైలుశిక్ష విధించింది కోర్టు.

Cyber crime : ప్రియురాలి క‌నురెప్ప‌ల‌తో రూ.18 ల‌క్ష‌లు దోచేసిన ఘనుడు..నాలుగేళ్లు జైలుశిక్ష విధించిన కోర్టు

China Yong Man Transfers Rs. 18 Lakhs From His Girlfriend Bank App

China man Cyber crime : ప్రియుడు పక్కనే ఉన్నాడు కదాని..హాయిగా నిద్రపోతోంది ప్రియురాలు.కానీ తన ప్రియుడు ఘరానా మోసగాడనీ..తనను దోచేస్తున్నాడని పాపం తెలియదు ఆమెకు. అందుకే హాయిగా నిద్రపోతోంది. కానీ ఆ ప్రియుడు మాత్రం తన పని సైలెంట్ గా కానిచ్చేశాడు. కానీ ఆనక గ‌ర్ల్‌ఫ్రెండ్ ముందు అడ్డంగా దొరికిపోయాడు. తనకు ఝలక్ ఇద్దామనుకున్న ప్రియుడికి ఆమె చిప్ప‌కూడు తినిపిస్తోంది. ఇంతకూ సదరు ప్రియుడు చేసిన ఘనకార్యం ఏంటంటే..

లేటెస్ట్ టెక్నాలజీతో ఫోన్ లో ఫేషియ‌ల్ రిక‌గ్నిష‌న్ ఫీచ‌ర్ ఉంటోంది. దాని వ‌ల్ల ఫోన్‌ను ఎవ్వ‌రూ ఓపెన్ చేసే అవకాశమే ఉండదు. వారి ఫేస్ చూపిస్తేనే ఫోన్ లాక్ ఓపెన్ అవుతుంది. చైనాలో అటువంటి ఫోన్ కలిగిన ఓ యువతిని ఆమె ప్రియుడు మోసం చేసి ఫోన్ అన్ లాక్ చేసి ఆమె ఎకౌంట్ లో ఉన్న డబ్బులు కొట్టేద్దామనుకున్నాడు. త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను నిద్ర‌పోతుండ‌గా.. గ‌ర్ల్‌ఫ్రెండ్ ఫోన్ తీసుకొని ఆమె క‌నురెప్ప‌లు తెరిచి ఫేషియ‌ల్ రిక‌గ్నిష‌న్ ద్వారా ఆ ఫోన్‌ను అన్‌లాక్ చేశాడు. ఆ త‌ర్వాత ఆమె ఫోన్‌ లో ఉన్న బ్యాంక్ యాప్ ద్వారా ల‌క్ష‌లు దోచేశాడు.

Read more : Balakrishna: సినిమా టికెట్ల ధరలపై బాలయ్య కీలక వ్యాఖ్యలు

తన గర్ల్ ఫ్రెండ్ గాఢ నిద్రలో ఉండటం గ‌మ‌నించిన సదరు యువ‌కుడు ముందు ఆమె ఫింగ‌ర్ ప్రింట్స్ ద్వారా త‌న ఫోన్‌ను అన్‌లాక్ చేశాడు. అయినా ఆ ఫోన్ అన్‌లాక్ కాలేదు. దీంతో ఫేస్ ఐడీ ద్వారా ఓపెన్ చేయటానికి నిద్రపోతున్నా గ‌ర్ల్‌ఫ్రెండ్ కనురెప్ప‌ల‌ను నెమ్మదిగా ఓపెన్ చేసి ఫేస్ ఐడీ ద్వారా ఆ ఫోన్‌ను అన్‌లాక్ చేసాడు. ఆమె అలిపే అకౌంట్‌ను యాక్సెస్ చేశాడు. అకౌంట్ పాస్‌వ‌ర్డ్ మార్చి పదే పదే 150,000 యువాన్ల‌ు మ‌న క‌రెన్సీలో సుమారు 18 ల‌క్ష‌ల రూపాయ‌లు త‌న బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకున్నాడు.

సదరు ఘనుడికి లేని అలవాట్లు లేవు. గ్యాంబ్లింగ్ ఆడటం అతని వీక్ నెస్. అలా ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాడు.అయినా ఆడటం మానడు. అప్పులు చేసిన మరీ గాంబ్లింగ్ ఆడతాడు. అలా అప్పులు ఎక్కువైపోయాయి. ఆ అప్పులు తీర్చటానికి ఇలా ప్రియురాలి డబ్బులు కాజేద్దామని ప్లాన్ వేశాడు. అదను కోసం వేచి చూసాడు. అలా ఓ రోజు ప్రియురాలు నిద్రపోతుండగా..నానా తంటాలు పడి డ‌బ్బులు అయితే ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకున్నాడు కానీ.. గ‌ర్ల్‌ఫ్రెండ్ ముందు అడ్డంగా దొరికిపోయాడు. ప్రియుడు చేసిన పనికి ఆమె రగిలిపోయింది. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది.

Read more : Diamonds hunting: వజ్రాల వేటకు ఏపీ సర్కార్ ఓకే!

అన్ని సాక్ష్యాధారాలతో పోలీసులు కోర్టులో సబ్మిట్ చేయగా చేసిన సైబర్ నేరం నిరూపణ అయ్యి కోర్టు సదరు ప్రియుడుగారికి మూడున్నర సంవత్సరాలు జైలుశిక్ష విధించింది. దీంతో గురుడు ప్రస్తుతం జైల్లో చిప్ప‌కూడు తింటున్నాడు.