Red Sandalwood Seized : చిత్తూరు జిల్లాలో రూ.1.5 కోట్ల ఎర్ర చందనం స్వాధీనం…18 మంది స్మగ్లర్లు అరెస్ట్

చిత్తూరు జిల్లాలో భారీ ఎత్తున ఎర్ర చందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 18 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు.

Red Sandalwood Seized : చిత్తూరు జిల్లాలో రూ.1.5 కోట్ల ఎర్ర చందనం స్వాధీనం…18 మంది స్మగ్లర్లు అరెస్ట్
ad

Red Sandalwood Seized : చిత్తూరు జిల్లాలో భారీ ఎత్తున ఎర్ర చందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 18 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న 3 టన్నుల బరువైన 290 ఎర్ర చందనం దుంగల విలువ సుమారు.రూ.1.5 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.

పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు   జిల్లాలోని  నారాయణవనం మండలం, ఉత్తుకోట–పుత్తూరు హైవే రోడ్డు, పాలమంగళం గ్రామ జంక్షన్ వద్ద శనివారంతెల్లవారు ఝూమున 2 గంటల సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వారి వద్ద నుండి  20 ఎర్ర చందనం దుంగలను, ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనము చేసుకున్నారు.

Also Read : Liquor Rates : ఏపీలో తగ్గనున్న మద్యం రేట్లు

వారు ఇచ్చిన సమాచారంతో సదాశివ కోనకు పోవు దారిలో గల పందులయ్య కోన కొండపై 14 మంది ఎర్ర చందనం కూలీలను, 270 ఎర్ర చందనం దుంగలను స్వాధీనము చేసుకున్నారు.  పట్టుబడిన స్మగ్లర్లలో ముగ్గురు చిత్తూరు జిల్లావారు కాగా 15 మంది తమిళనాడు లోని తిరువణ్ణామలై జిల్లాకు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్ లో పుత్తూరు, నారాయణవనం, కేవీబీపురం, పిచ్చాటూరు పోలీసు స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.