ట్యూషన్ కు వెళ్లి వస్తున్న గిరిజన బాలికపై అత్యాచారం, హత్య ?

  • Published By: madhu ,Published On : October 18, 2020 / 09:46 AM IST
ట్యూషన్ కు వెళ్లి వస్తున్న గిరిజన బాలికపై అత్యాచారం, హత్య ?

Class 5 student gangraped : దేశంలో అత్యాచార ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి. కిరాతకంగా, ఒళ్లు గొగురుపొడిచే విధంగా..దారుణలకు తెగబడుతున్నారు. యూపీలో జరిగిన ఘటనపై దేశ వ్యాప్తంగా..ఆందోళనలు, నిరసనలు జరుగుతున్న క్రమంలో..ఇతర రాష్ట్రాల్లో అత్యాచారాలు, హత్య ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.



తాజాగా..జార్ఖండ్ రాష్ట్రంలో డుమ్కా జిల్లాలో శుక్రవారం 12 ఏళ్ల గిరిజన బాలిక మృతదేహం లభ్యమైంది. బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ ఘటనను సీఎం హేమంత్ సోరెన్ ఖండించారు.

కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా..నేరస్థులకు తొందరగా శిక్షలు పడే విధంగా చూడాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎంవీ రావుకు సీఎం సోరెన్ సూచించారు.



రామ్ ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిడి గ్రామంలో ఐదో తరగతి చదువుతున్న బాలిక మృతదేహం కనిపించింది. అయితే బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన తర్వాత..హత్య చేశారని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పోస్టుమార్టం నివేదక వస్తే..కానీ ఏమీ చెప్పలేమని పోలీస్ సూపరిటెండెంట్ అంబర్ లక్రా చెప్పారు. జార్ఖండ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాలనపై ప్రతిపక్షాలు విరుచుకపడుతున్నాయి. జార్ఖండ్ ప్రాంతంలోని Dumka, Bermo స్థానాలకు నవంబర్ 03వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి.