మీ కంప్యూటర్‌పై హ్యాకర్లు ఎంత సింపుల్‌గా ఎటాక్ చేస్తారంటే! మరి ఎలా తప్పించుకోవాలి?

మీ కంప్యూటర్‌పై హ్యాకర్లు ఎంత సింపుల్‌గా ఎటాక్ చేస్తారంటే! మరి ఎలా తప్పించుకోవాలి?

common ways hackers will attack your computer: ప్రస్తుత రోజుల్లో సైబర్ దాడులు పెరిగిపోతున్నాయి. హ్యాకర్లు విలువైన సమాచారాన్ని తస్కరించేందుకు అనేక అత్యుధానిక టెక్నికల్ టూల్స్ వాడుతున్నారు. అనేక దొంగ దారుల్లో కంప్యూటర్లను హ్యాక్ చేస్తున్నారు. ఇంతకీ మీ కంప్యూటర్‌కు హ్యాకర్ల ముప్పు ఉందో తెలుసుకోవాలని ఉందా? అయితే ముందుగా సైబర్ ఎటాక్ చేయడానికి హ్యాకర్ ఎలాంటి దారులనే ఎంచుకుంటారో అవగాహన ఉండాలి. అప్పుడే హ్యాకర్ల ముప్పు నుంచి కంప్యూటర్లను కాపాడుకోవచ్చునని సైబర్ నిపుణులు చెబుతున్నారు. హ్యాకర్లు సైబర్ దాడి చేసే అత్యంత సాధారణ మార్గాలకు సంబంధించి కొత్త నివేదికను సైబర్ సెక్యూరిటీ కంపెనీ ప్రూఫ్ పాయింట్ రెడీ చేసింది. మీ కంప్యూటర్‌లోకి ప్రవేశించడానికి హ్యాకర్లు తీసుకునే సాధారణ దశలుగా చెబుతున్నారు.

అందులో ప్రధానంగా హ్యాకర్లు ఉపయోగించేది ఫిషింగ్ ఈమెయిల్స్.. వీటి ద్వారా హ్యాకర్లు పంపిన మెసేజ్ లను ఓపెన్ చేయడం ద్వారా హ్యాక్ చేయడం చేస్తుంటారు. ప్రూఫ్ పాయింట్ పరిశోధకులు తమ నివేదికలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఈమెయిల్ సైబర్ దాడులకు అతిపెద్ద ఛానెల్ గా చెప్పవచ్చు. నాల్గవ త్రైమాసికంలో ఈమెయిల్ సైబర్ దాడి పద్ధతులను విశ్లేషించినట్టు పరిశోధకులు పేర్కొన్నారు. వాటిలో దాదాపు అన్ని సోషల్ ఇంజినీరింగ్ టూల్స్ సాయంతోనే హ్యాకర్లు డేటా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని నిర్ధారించారు. ఈ రకమైన ఈమెయిల్స్ చూడటానికి అచ్చం కంపెనీ ఈమెయిల్స్ మాదిరిగానే కనిపిస్తాయి. వీటికి సైబర్ నేరగాళ్లు నకిలీ ఇన్వాయిస్ లేదా బిల్లు మాదిరిగా జత చేసి పంపిస్తారు. మీ పేమెంట్ డ్యూ ఉందంటూ నమ్మిస్తూ ఒక ఈమెయిల్ లింకు పంపుతారు.

ఫెడెక్స్ వంటి మెసేజ్ లతో 10వేల మంది మైక్రోసాఫ్ట్ ఈమెయిల్ వినియోగదారులు ఫిషింగ్ ఎటాక్‌లో చిక్కుకున్నారు. ఇదంతా సోషల్ ఇంజనీరింగ్‌లో ఒక భాగం. హ్యాకింగ్‌లో అనేక టెక్నికల్ భాగాలు ఉన్నాయి. ఏదైనా సస్పెక్ట్ మెసేజ్ లేదా ఈమెయిల్ లింక్ ఓపెన్ చేయడం లేదా క్లిక్ చేయడం ద్వారా హ్యాకర్లు ఈజీగా మీ కంప్యూటర్ లోకి చొరబడే అవకాశం ఉంది. సోషల్ ఇంజనీరింగ్ ద్వారా హ్యాకర్లు మిమ్మల్ని చీటింగ్ చేసే మార్గం. సోషల్ ఇంజనీరింగ్ అనేది అన్ని సైబర్ దాడులలో 99శాతం సులభమైన మార్గంగా హ్యాకర్లు భావిస్తుంటారని ప్రూఫ్ పాయింట్ బృందం పేర్కొంది .

హ్యాకర్లలో అనేక రకాల హ్యాకర్లు ఉంటారు. ఒక్కో హ్యాకింగ్ కొన్ని పరిమిత అంశాలకు లోబడి ఉంటుంది. స్టేట్ స్పాన్సర్డ్ హ్యాకర్లు, సైబర్ క్రైమ్ రింగ్స్, హ్యాక్టివిస్టులు ఇలా ఉంటారు. అయితే వీరిలో స్టేట్ స్పాన్సర్డ్ హ్యాకర్లు అంటే.. వీరంతా ప్రభుత్వం తరపున గూఢచార్యంగా చేస్తుంటారు. వీరెప్పుడు దౌత్యపరమైన లేదా సైనిక పరమైన లక్ష్యాలపై ఫోకస్ పెడుతుంటారు. సైబర్ క్రైమ్ రింగ్స్ హ్యాకర్లు అంటే.. సాధారణంగా వీరిని గ్రూపు హ్యాకర్లు అంటారు. అంటే.. డబ్బు కోసం చేసే హ్యాకింగ్ అనమాట.. హ్యాకింగ్ చేసేందుకు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. హ్యాక్టివిస్టులు.. వీరు చాలా అరుదుగా ఉంటారు. సీక్రెట్ సమాచారాన్ని బహిర్గతం చేస్తుంటారు. విలువైన డేటాను పబ్లిక్ లో బహిర్గతం చేసేందుకు పాస్ వర్డ్ వెనుక మాల్ వేర్ ఫైల్స్ లాక్ చేసి అటాచ్ చేస్తారు. మాల్ వేర్ డిటెక్షన్ ప్రొగ్రామ్ అంటారు.. దీనిద్వారా పాస్ వర్డ్ హ్యాకింగ్ నుంచి తప్పించుకోవచ్చు.