అసదుద్దీన్ ఒవైసీపై కేసు : మధ్యప్రదేశ్ లో ఫిర్యాదు

  • Published By: chvmurthy ,Published On : November 11, 2019 / 12:45 PM IST
అసదుద్దీన్ ఒవైసీపై కేసు : మధ్యప్రదేశ్ లో ఫిర్యాదు

హైదరాబాద్ ఎంపీ, AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పై మధ్యప్రదేశ్ లో కేసు నమోదు అయ్యింది. నవంబర్ 9న వివాదాస్పద అయోధ్య రామజన్మ భూ వివాదం కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. రామజన్మ న్యాస్‌కే వివాదాస్పద స్థలాన్ని అప్పగించాలని కోర్టు ఆదేశించింది. అదే విధంగా అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్‌ బోర్డుకు ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీం కోర్టు తీర్పు పట్ల అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశాడు మధ్య ప్రదేశ్ లోని ఒక లాయర్. పవన్ కుమార్ యాదవ్ అనే లాయర్ జహంగీర్ బాద్ పోలీసు స్టేషన్ లోఓవైసీ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశాడు. 

సర్వోన్నత న్యాయస్ధానం తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఒవైసీ …ఈవిషయంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటనను సమర్థిస్తున్నట్లు చెప్పారు. మసీదు కోసం ప్రత్యేకంగా 5 ఎకరాల స్ధలం మాకొద్దు అని, ఆ ఆఫర్ ను తిరస్కరిస్తున్నామని ఆయన అన్నారు. సుప్రీం తీర్పు అసంపూర్తిగా ఉంది. ఈ విషయంలో ముస్లిం వర్గానికి అన్యాయం జరిగింది. తీర్పు పట్ల అసంతృప్తిగా ఉన్నానని చెప్పడం తనహక్కు అని  ఎంపీ ఒవైసీ అన్నారు.