Vishnu Complaint Against Revanth : టీ.పీసీసీ చీఫ్ రేవంత్‌పై కాంగ్రెస్ నేత విష్ణు ఫిర్యాదు..బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు
టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. రాష్ట్ర కాంగ్రెస్ బాస్‌పై ఆ పార్టీ కీలక నేత ఫిర్యాదు చేయడం ఆశ్చ్యర్యానికి గురి చేస్తోంది. రేవంత్ పై తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Vishnu complaint against Revanth
Vishnu complaint against Revanth : టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. రాష్ట్ర కాంగ్రెస్ బాస్‌పై ఆ పార్టీ కీలక నేత ఫిర్యాదు చేయడం ఆశ్చ్యర్యానికి గురి చేస్తోంది. రేవంత్ పై తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇటీవల పెద్దమ్మ గుడిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందని రేవంత్ మాట్లాడారు. దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడిన ఆలయ ఫౌండర్ విష్ణు..జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో ఎలాంటి అసాంఘీక కార్యక్రమాలు జరగలేదన్నారు. దేవాలయంలో రేప్ జరగలేదని పోలీసులే చెప్పారని గుర్తు చేశారు.
Revanth Reddy Letter CM KCR : సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
రేవంత్ నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని విష్ణు సూచించారు. ఇన్వెస్టిగేషన్ చేసిన ఐపీఎస్‌ల కంటే రేవంత్ పెద్ద ఐపీఎస్ కాదని, ఆయన వ్యాఖ్యలు దేవాలయ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. రేవంత్ పై తగిన చర్యలు తీసుకోవాలని విష్ణు పోలీసులను కోరారు.