పనంటే ప్రాణం! : డ్యూటీకి వెళ్లొద్దన్న భార్యను చంపిన కానిస్టేబుల్ 

పనంటే ప్రాణం! : డ్యూటీకి వెళ్లొద్దన్న భార్యను చంపిన కానిస్టేబుల్ 

పనంటే ప్రాణం! : డ్యూటీకి వెళ్లొద్దన్న భార్యను చంపిన కానిస్టేబుల్ 

ఎన్నికల డ్యూటీకి వెళ్లొద్దని అడ్డుకున్న భార్యను.. శాశ్వతంగా అడ్డుతొలగించుకున్నాడు భర్త. అతను చేస్తున్న ఉద్యోగం పోలీస్ కానిస్టేబుల్. ఎన్నికల విధులకు వెళ్లటానికి రెడీ అయ్యాడు భర్త. వద్దని వాదనకు దిగింది భార్య. డ్యూటీకి వెళ్లొద్దు అంటావా అంటూ.. ఆవేశంలో  భార్యను చంపేశాడు కోబ్రా దళం (Commando battalion for Resolute Action) కానిస్టేబుల్. చత్తీస్ ఘడ్ రాష్ట్రం, జగదల్ పూర్ పోలీసు హెడ్ క్వార్టర్స్ లో మార్చి 16న జరిగిన సంచలనం అయ్యింది.

కోబ్రా దళంలో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు గురువీర్ సింగ్. భార్యతో కలిసి జగదల్పూర్ పోలీసు హెడ్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నాడు. 2019, మార్చి 17 నుంచి గురువీర్ సింగ్ ఎన్నికల డ్యూటీకి వెళ్లాల్సి ఉంది. అయితే ఎన్నికల డ్యూటీకి వెళ్లొద్దని భార్య అనుప్రియ గౌతమ్ వారించింది. 16వ తేదీ రాత్రి భర్తతో గొడవ పడింది. ఇద్దరి మధ్య మాటమాటా పెరిగింది. ఆ తర్వాత హత్యకు దారితీసింది.
Read Also :మా ఫ్యామిలీలో చంపుకునేంత గొడవలు లేవు : వివేకా కుమార్తె సునీత

గొడవలో ఆవేశం ఆపుకోలేని గురువీర్ సింగ్ తన భార్యను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత తన భార్య ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఎంక్వయిరీలో భార్యను తనే చంపినట్లు ఒప్పుకున్నాడు. ఎందుకు చంపాల్సి వచ్చిందో వివరంగా చెప్పాడు. అసలు విషయం తెలిసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఐపీసీ సెక్షన్ 302,201 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. గురువీర్ సింగ్ ను రిమాండ్ కు తరలించారు.  

×