న్యూ ఇయర్ కిక్ : మరో డ్రగ్స్ గ్యాంగ్ అరెస్ట్
హైదరాబాద్ నగరం న్యూ ఇయర్ వేడుకలకు రెడీ అయ్యింది. ఫుల్‌గా ఎంజాయ్ చేయడానికి యూత్ ఏర్పాట్లు చేసుకుంటోంది. హోటల్స్, పబ్స్ ప్రత్యేక ఆఫర్స్ ఇస్తున్నాయి.

హైదరాబాద్ నగరం న్యూ ఇయర్ వేడుకలకు రెడీ అయ్యింది. ఫుల్‌గా ఎంజాయ్ చేయడానికి యూత్ ఏర్పాట్లు చేసుకుంటోంది. హోటల్స్, పబ్స్ ప్రత్యేక ఆఫర్స్ ఇస్తున్నాయి.
హైదరాబాద్ నగరం న్యూ ఇయర్ వేడుకలకు రెడీ అయ్యింది. ఫుల్‌గా ఎంజాయ్ చేయడానికి యూత్ ఏర్పాట్లు చేసుకుంటోంది. హోటల్స్, పబ్స్ ప్రత్యేక ఆఫర్స్ ఇస్తున్నాయి. ఇదే అదనుగా న్యూ ఇయర్‌ను క్యాష్ చేసుకునేందుకు డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. యువతకు గాలం వేసి.. గంజాయి, డ్రగ్స్ కొనేలా ప్లాన్స్ చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది యువతీయువకులు వీటి కోసం అడ్డదార్లు తొక్కుతున్నారు. దీనిని సొమ్ము చేసుకునేందకు స్మగ్లర్లు పెద్దఎత్తున హైదరాబాద్ నగరంలోకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.
వీరి ఆటలకు హైదరాబాద్, రాచకొండ పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. తాజాగా మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 83గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ ఈవెంట్ కోసం గోవా నుంచి డ్రగ్స్ సరఫరా చేసినట్టు పోలీసులు గుర్తించారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్‌ని అమ్మడానికి ప్లాన్ వేసినట్లు విచారణలో తేలింది.