వారసుడి కోసం 10 కాన్పులు.. చివరికి ప్రాణాలు వదిలి
చివరికి అత్తంటివారి కలను నెరవేర్చి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ, తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రిలోనే ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో చోటుచేసుకుంది.

చివరికి అత్తంటివారి కలను నెరవేర్చి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ, తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రిలోనే ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో చోటుచేసుకుంది.
-
మగశిశువుకు జన్మనిచ్చి తీవ్ర రక్తస్రావంతో మహిళ మృతి..
-
ఏడుగురు ఆడ పిల్లలే.. అబ్బాయి కోసం అత్తంటివారు ఒత్తిడి
వంశాన్ని నిలబెట్టే మనమడు పుట్టాలని అత్తగారి ఆరాటం ఒకవైపు.. కొడుకే కావాలని భర్త ఒత్తిడి మరోవైపు.. కానీ, ప్రతి కాన్పులో ఆడపిల్లలే పుట్టారు ఆ మహిళకు. ఇలా ఏడుగురు ఆడపిల్లలు పుట్టారు. అయినా అత్తంటివారిలో మగబిడ్డ కావాలనే ఆశ చావలేదు. ఏదిఏమైనా మగబిడ్డను కనాల్సిందేనని కోడలిపై అత్తగారి రుసరుసలు.. పుట్టేది ఆడపిల్లా.. మగబిడ్డా తనచేతుల్లో లేదని కోడలికి తెలుసు. అది అర్థం చేసుకునే పరిస్థితుల్లో అత్తంటివారు లేరు. వారికి ఎలా సర్దిచెప్పాలో తెలియని ఆ కోడలి తీవ్ర మనోవేదిన ఇది. పదిసార్లు పురిటినొప్పులు భరించింది. చివరికి అత్తంటివారి కలను నెరవేర్చింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. వంశాన్ని నిలబెట్టింది.. తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రిలోనే ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో చోటుచేసుకుంది.
మీరా ఈఖండే అనే మహిళ బీడ్ జిల్లాలోని మంజల్ గన్ టౌన్‌లో పాన్ షాపు నడుపుతోంది. పెళ్లైన ఏడాదిలోనే తొలి కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అత్తగారేమో వారసుడు కావాలని పట్టుబట్టారు. ప్రతి కాన్పులో ఆడపిల్లే పుట్టింది. కుటుంబం ఒత్తిడితో గర్భం దాల్చిన మీరాకు రెండుసార్లు అబార్షన్లు అయ్యాయి. చివరిగా పదోసారి గర్భం దాల్చింది. ఈసారి కొడుకే పుట్టాడు. అత్తంటివారి కల నెరవేరింది. కానీ, ప్రసవించిన కాసేపటికే తల్లి మీరా తీవ్ర రక్తస్రావంతో కన్నుమూసింది. సివిల్ ఆస్పత్రిలో శనివారం ప్రసవించిన మీరా.. మగబిడ్డకు జన్మనిచ్చి మృతిచెందినట్టు పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఇటీవలే ఏడుగురు కుమార్తెల్లో ఒక పాప అనారోగ్యంతో చనిపోయినట్టు సిటీ పోలీసు ఆఫీసర్ పేర్కొన్నారు.