గర్భిణీపై గ్రామ పెద్దల అమానుష తీర్పు..

గ్రామ పెద్దల అరాచకానికి వారి మూర్ఖత్వానికి ఓ చిన్నారి భూమి మీదకు రాకుండానే తల్లి కడుపులోనే అంతమైపోయింది. అటవిక తీర్పులతో మహిళలను అణచివేసే ఘటనలు దేశవ్యాప్తంగా కొనసాగుతునే వున్నాయి. పరువు కోసం ఒకచోట..పంతం కోసం మరోచోట...ఆధిపత్యం కోసం..

  • Published By: sreehari ,Published On : December 29, 2018 / 12:27 PM IST
గర్భిణీపై గ్రామ పెద్దల అమానుష తీర్పు..

గ్రామ పెద్దల అరాచకానికి వారి మూర్ఖత్వానికి ఓ చిన్నారి భూమి మీదకు రాకుండానే తల్లి కడుపులోనే అంతమైపోయింది. అటవిక తీర్పులతో మహిళలను అణచివేసే ఘటనలు దేశవ్యాప్తంగా కొనసాగుతునే వున్నాయి. పరువు కోసం ఒకచోట..పంతం కోసం మరోచోట…ఆధిపత్యం కోసం..

సూతాహట్‌ (పశ్చిమ బెంగాల్‌) :  గ్రామ పెద్దల అరాచకానికి వారి మూర్ఖత్వానికి ఓ చిన్నారి భూమి మీదకు రాకుండానే తల్లి కడుపులోనే అంతమైపోయింది. అటవిక తీర్పులతో మహిళలను అణచివేసే ఘటనలు దేశవ్యాప్తంగా కొనసాగుతునే ఉన్నాయి. పరువు కోసం ఒకచోట..పంతం కోసం మరోచోట…ఆధిపత్యం కోసం..అణిచివేత ధోరణితో ఓ గర్భిణి పట్ల గ్రామ పెద్దలు ఇచ్చిన తీర్పుతో ఓ గర్భిణి గర్భవిచ్ఛిత్తికి కారణమైంది. అంతేకాదు ఆమె ప్రాణాలమీదకు వచ్చింది సదరు గ్రామ పెద్దలు ఇచ్చిన తీర్పు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ అమానుష ఘటన రాష్ట్రానికి చెందిన తూర్పు మిడ్నాపూర్‌ జిల్లా హల్దియా పరిధిలోని సూతాహట్‌లో చోటు చేసుకుంది.  

మనుషులమనే మాట మరిచి ఆటవిక తీర్పుతో గర్భంతో ఉన్న‌మహిళతో గుంజీలు తీయించి ఆమె గర్భస్రావానికి కారణమయ్యారు పంచాయతీ పెద్దలు. గ్రామానికి చెందిన ఓ మహిళ తమతో దురుసుగా ప్రవర్తించిందని కొందరు యువకులు గ్రామపెద్దలకు ఫిర్యాదు చేశారు. దీంతో హుటా హుటిన రాత్రికి రాత్రే గ్రామపెద్దలు సభ ఏర్పాటు చేసి ఆ మహిళను పిలిపించి తప్పు చేసినట్లు నిర్థారించేశారు. అంతేకాదు శిక్షకూడా వేసారు. 

గర్భంతో వున్న ఆ మహిళతో వంద గుంజీలు తీయాలని ఆదేశించారు. గర్భవతినని ఆమె చెప్పినా వారు పట్టించుకోలేదు. గుంజిళ్లు తీయాల్సిందేనని ఖరాఖండీగా తేల్చి చెప్పారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో ఆమె వంద గుంజీలు తీసింది. దీంతో ఆమె ఆరోగ్యం దెబ్బతినడంతో హల్దియా ఆసుపత్రిలో చేర్పించగా..అదేరోజు గర్భస్రావమైంది. ఈ విషయాన్ని బాధితురాలి తల్లి కన్నీరుమున్నీరవుతు హల్దియా పోలీస్‌స్టేషన్‌లో  ఫిర్యాదు చేసారు. కాగా ఈ ఘటనపై పోలీసులు మాత్రం ఇంత వరకూ  ఎవరినీ అరెస్టు చేయకపోవటం గమనించాల్సిన విషయం.