Manappuram Gold Loan Case : మణప్పురం గోల్డ్‌లోన్ కేసు చేధించిన పోలీసులు

హైదరాబాద్ హిమాయత్‌నగర్ మణప్పురం గోల్డ్‌లోన్ సంస్ధలో రూ.30 లక్షల రూపాయల దోపిడీ కేసును పోలీసులు చేధించారు. ప్రధాన నిందితుడు మణప్పురం గోల్డ్‌లోన్ సంస్ధలోని మాజీ ఉద్యోగిగా గుర్తించారు.

Manappuram Gold Loan Case : మణప్పురం గోల్డ్‌లోన్ కేసు చేధించిన పోలీసులు

Manappuram Gold Loan Case

Manappuram Gold Loan Case : హైదరాబాద్ హిమాయత్‌నగర్ మణప్పురం గోల్డ్‌లోన్ సంస్ధలో రూ.30 లక్షల రూపాయల దోపిడీ కేసును పోలీసులు చేధించారు. ప్రధాన నిందితుడు మణప్పురం గోల్డ్‌లోన్ సంస్ధలోని మాజీ ఉద్యోగిగా గుర్తించారు. తనను భువనేశ్వర్ నుంచి కేరళకు ట్రాన్పఫర్ చేశారన్న కక్షతోనే ఈదోపిడీకి పాల్పడినట్లు తెలిసింది.

మణప్పురం సంస్ధ, భువనేశ్వర్ లోని బ్రాంచ్‌లో ఆదిత్యనారాయణ మహాపాత్రో(22) అనే యువకుడు పని చేస్తున్నాడు. అతను బాగా పనిచేయటంతో సంస్ధ అతడికి ప్రమోషన్ ఇచ్చి, మరింత నైపుణ్యం పెంపొందించుకునేందుకు రెండు నెలల క్రితం కేరళ బదిలీ చేసింది. ఆదిత్యనారాయణ కేరళ వెళ్ళటానికి ఇష్టపడలేదు. అయినా ఆఫీసు వారు కేరళ బదిలీ చేశారు. కొద్ది రోజుల పాటు అక్కడ ఉన్నా, ఆ వాతావరణంలో ఇమడలేక తిరిగి భువనేశ్వర్ వచ్చి రాజీనామా చేశాడు. వద్దని చెపుతున్నా తనను ఉద్దేశ్యపూర్వకంగానే కేరళ ట్రాన్సఫర్ చేశారని భావించి సంస్ధ మీద కోపం తీర్చుకునేందుకు స్నేహితుల సాయం తీసుకున్నాడు.

మణప్పురం సంస్ధ కొద్ది రోజుల క్రితం ప్రవేశ పెట్టిన ఇంటివద్దకే బంగారు రుణం పధకాన్ని వినియోగించి స్నేహితుల సాయంతో సంస్ధ సొమ్ము రూ.30 లక్షలు కాజేశాడు. ఈపధకం కింద ఉద్యోగులు సంస్ధ వెబ్సైట్‌లో తమ యూజర్ ఐడీతో లాగిన్ అయి వినియోగదారుల వివరాలు నమోదు చేస్తే వారి ఖాతాల్లోకి నగదు మళ్లుతుంది. ఈప్రక్రియను తనకు అనుకూలంగా మలుచుకున్నాడు.

జూన్ 24న హిమాయత్ నగర్ మణప్పురం గోల్డ్‌లోన్ కార్యాలయానికి ఫోన్ చేసి కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని చెప్పి ఇద్దరు ఉద్యోగుల యూజర్ ఐడీ తీసుకున్నాడు. వారు ఇవ్వగానే రెండు పేర్లతో నకిలీ వివరాలు సృష్టించి రూ.15లక్షల చొప్పున రూ.30 లక్షలను బ్యాంకు ఖాతాలోకి జమ చేసుకున్నాడు. ఆడబ్బులను స్నేహితులందరూ కలిసి వాటాలు వేసి పంచుకున్నారు. అందరూ ఐ ఫోన్లు కొనుకున్నారు.

మరునాడు మణప్పురం సంస్ధ రోజు వారి కార్యకలాపాలు పరిశీలిస్తుండగా రూ.30 లక్షల రూపాయలకు సరిపడా బంగారం తేడా రావటంతో జరిగిన నేరం గుర్తించారు. ఏ బ్రాంచ్‌లో తేడా జరిగిందో గుర్తించి వారిని అలర్ట్ చేశారు. వెంటనే హిమయత్ నగర్ బ్రాంచ్ సిబ్బంది సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన అదిత్యనారాయణ మహాపాత్రో తో పాటు అతని స్నేహితులైన లక్ష్మీధర్ ముర్ము(21),ప్రమోద్ నాయక్(23)సౌమ్య రంజన్ పట్నాయక్(21) దేవాశీష్ ఓఝా(20)లను అరెస్ట్ చేసి స్ధానిక కోర్టులో ప్రవేశపెట్టి సోమవారం నగరానికి తీసుకు వచ్చామని విచారణ అనంతరం జైలుకు తరలించామని హైదరాబాద్ సైబర్ ఇన్ స్పెక్టర్ హరిభూషణ్ చెప్పారు. వారి వద్దనుంచి 6 సెల్ ఫోన్లు ….వీరి బ్యాంకు ఖాతాకు సంబంధించిన రూ.10లక్షల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్ సైబర్ ఇన్స్పెక్టర్ హరిభూషణ్ తెలిపారు.