Morphed Photos : సంబంధం నచ్చలేదన్నారని యువతిని వేధించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్

పెళ్లి సంబంధం వద్దన్నారనే   కక్షతో యువతి ఫోటోలను మార్ఫింగ్  చేసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. 

Morphed Photos : సంబంధం నచ్చలేదన్నారని యువతిని వేధించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్

Software Engineer Arrest

Morphed Photos :  పెళ్లి సంబంధం వద్దన్నారనే   కక్షతో యువతి ఫోటోలను మార్ఫింగ్  చేసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన  సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను మేడిపల్లి  పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బోడుప్పల్ ప్రాంతానికి చెందిన యువతి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తోంది. ఆమె వివాహం నిమిత్తం తన వివరాలను ఒక మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుంది.

నెల్లూరుకు చెందిన  సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సుమాణం సాయికుమార్(29) కు మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో ఆ యువతి వివరాలు నచ్చటంతో వారి తల్లి తండ్రులను సంప్రదించాడు. ఇరు వైపు పెద్దలు కలిసి హైదరాబాద్‌లో యువతి ఇంట్లో పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేశారు.  అనంతరం జరిగిన పరిణామాల్లో యువతి తల్లితండ్రులు సాయికుమార్ సంబంధాన్ని వద్దు అనుకుని క్యాన్సిల్ చేసుకున్నారు.

Also Read : Covid-19 Updates : తెలంగాణలో కొత్తగా 156 కోవిడ్ కేసులు

దీంతో యువతిపై కక్ష పెంచుకున్న సాయికుమార్   యువతి  ఫోటోతో  నకిలీ  ఫేస్‌బుక్ ఖాతా తెరిచి ఆమె ఫోటోలు అసభ్యంగా మార్ఫింగ్ చేసి, ఫోన్ నెంబర్ ను అందులో  పోస్ట్ చేశాడు. ఈవిషయం యువతికి తెలియటంతో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యింది. యువతి తల్లితండ్రులతో కలిసి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధితురాలు ఇచ్చిన సమాచారంతో  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసు విచారణలో  సుమాణం సాయికుమారే ఈ పని చేసినట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.  దీంతో నిందితుడు నేరం ఒప్పుకున్నాడు.  ఐపీసీ సెక్షన్ 354(D) ఐపీసీ,292 ఐపీసీ, సెక్షన్ 67 IT యాక్ట్ ప్రకారం నిందితుడిపై  కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.