డ్రగ్స్ అమ్మటం కోసం స్ధానికులను పెళ్లి చేసుకుంటున్న ఆఫ్రికన్లు

  • Published By: murthy ,Published On : December 12, 2020 / 01:38 PM IST
డ్రగ్స్ అమ్మటం కోసం స్ధానికులను పెళ్లి చేసుకుంటున్న ఆఫ్రికన్లు

African Drug Dealers Who Went Local, Learnt Hindi, Wed Indians : ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఆఫ్రికన్ డ్రగ్ రాకెట్ ను చేధించారు. వీరి వద్దనుంచి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. డిసెంబర్ 11, శుక్రవారం నాడు పోలీసులకు అందిన విశ్వనీయ సమాచారం మేరకు ఇద్దరు విదేశీయులు స్ధానిక మాదక ద్రవ్యాలు అమ్మేవ్యక్తులకు సరుకు అందించటానికి వస్తున్నట్లు తెలుసుకున్నారు.

స్ధానికంగా డ్రగ్స్ అమ్మే దిననాధ్ ఎలియాస్ తుంటున్ రంగనాధ్ చౌహాన్(33) సన్నీ సాహులు ఖండివ్లి లో ఆటోరిక్షాలో ఎదురు చూస్తుండగా వారికి డ్రగ్స్ ఇవ్వటానికి ద్విచక్ర వాహనం పై వచ్చిన ఇద్దరు ఆఫ్రికన్ లతోసహా మొత్తం నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసారు. విదేశీయులను పశ్చిమ ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్ కు చెందిన ఫ్లూగన్స్ అలియాస్ రోలాస్, అలియాస్ ముస్తఫా లౌడ్ (31), జర్మైన్ జెర్రీ అబా (29) గా గుర్తించారు. వీరి వద్దనుంచి రూ.1.40 కోట్ల విలువైన 700 గ్రాముల మెఫెడ్రిన్ ను స్వాధీనం చేసుకున్నారు.
Dinanath-Sunny-Sahu

విదేశీయులు మొదట స్టూడెంట్, టూరిస్టు వీసాల మీద భారతదేశం లోకి వస్తున్నారని….. వీసా గడువు ముగిసిపోయినా స్వదేశం తిరిగి వెళ్లకుండా ఇక్కడే తిష్ట వేసుకుని డ్రగ్స్ అమ్మకాలు చేపడుతున్నారని క్రైమ్ డీసీపీ అక్బర్ పఠాన్ తెలిపారు. ముంబై వచ్చిన వీరు గతంలో మీరారోడ్, నవీ ముంబైలలోని కొన్ని ప్రదేశాల్లో నివసించేవారు. ఇప్పుడు నలకోపోరా, వాసాయి, విరార్లాకు వ్యాపించారు.

వ్యాపార విస్తరణ కోసం స్ధానిక భాష నేర్చుకుని ఇక్కడి మహిళలను వివాహాం చేసుకుని వారి ద్వారా కూడా స్ధానికంగా వ్యాపార విస్తరణ చేపడుతున్నారు. వ్యాపార లావాదేవీల్లో స్ధానిక భాష మాట్లాడే వీరు పోలీసులకు చిక్కితే మాత్రం భాష రానట్లు ఆఫ్రికన్ భాషలో మాట్లాడి పోలీసులను ముప్ప తిప్పలు పెడుతున్నారని ఆయన తెలిపారు.

ఎవరైనా ఆఫ్రికన్ ను అరెస్ట్ చేయగానే మిగతా వారంతా పోలీసు స్టేషన్ ను ముట్టడిస్తారని డీసీపీ వివరించారు. దర్యాప్తుకు సహకరించరని… వ్యాపార విస్తరణకు మాత్రం స్ధానిక భాషలో మాట్లాడి మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నారని పోలసులు తెలిపారు.