సుభోధ్ కేసులో కొత్త ట్విస్ట్..పోలీసులు కావాలనే

  • Published By: venkaiahnaidu ,Published On : January 28, 2019 / 05:16 AM IST
సుభోధ్ కేసులో కొత్త ట్విస్ట్..పోలీసులు కావాలనే

ఉత్తరప్రదేశ్ బులంద్ శహర్ లో గతేడాది డిసెంబర్ 3న జరిగిన  అల్లర్లలో మూకదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇన్ స్పెక్టర్ ప్రభోధ్ కుమార్ సింగ్ కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సుభోధ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రశాంత్ నట్ భార్య సోమవారం(జనవరి 28, 2019) కీలక వ్యాఖ్యలు చేసింది. సోబోధ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రశాంత్ నట్ ఇంటి నుంచి తాము సుబోధ్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని ఆదివారం(జనవరి 27, 2019) యూపీ పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే పోలీసులు కావాలనే సుభోధ్ ఫోన్ ను తమ ఇంట్లో పడేశారని ప్రశాంత్ నట్ భార్య  ఆరోపించింది. తమ దగ్గర  సెర్చ్ వారెంట్ ఉందని చెబుతూ పోలీసులు తమ ఇంటికి వచ్చారని, ప్రశాంత్ కి చెందిన రూమ్ ఏదని అడిగారని, ఆ రూమ్ లోకి వెళ్లిన పోలీసులు వాళ్ల వెంట తీసుకొచ్చిన ఫోన్ ను  అక్కడి డ్రస్సింగ్ టేబుల్ పై పెట్టారని ఆరోపించారు. తాము ఈ ఫోన్ తమది కాదని చెబుతుంటే వినకుండా నోరు మూసుకొని ఉండండి అని పోలీసులు తమను బెదిరించారిని ఆమె ఆరోపించారు.
సోబోధ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రశాంత్ నట్ ఇంటి నుంచి తాము సుబోధ్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని ఆదివారం(జనవరి 27, 2019) యూపీ పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.

సోబోధ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం…అతడి పుర్రెలో ఓ బుల్లెట్ ఉండిపోయింది. అంతేకాకుండా రాళ్లతో, గొడ్డలితో అతడిపై దాడి జరిగినట్లు తేలింది. 
ఈ కేసులో ప్రధాన అనుమానితుడుగా ఉన్న ప్రశాంత్ నట్ సుభోధ్ ని తానే కాల్చినట్లు విచారణలో అంగీకరించాడని పోలీసు వర్గాలు తెలిపాయి.