డాక్టర్ పై కరోనా పేషెంట్ దాడి

  • Published By: bheemraj ,Published On : June 9, 2020 / 06:32 PM IST
డాక్టర్ పై కరోనా పేషెంట్ దాడి

హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ పై కరోనా పేషెంట్ దాడి చేశాడు. ఐసీయూలో కూడా పెద్ద గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. ఓ కరోనా పాజిటివ్ పేషెంట్ సడెన్ గా లేచి బాత్ రూమ్ కు వెళ్తున్న సమయంలో కుప్పకూలి పడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. తనతో పాటు ఉన్న పాజిటివ్ బంధువు ఇంకొకరు సెలైన్ బాటిల్ ఎక్కించే రాడ్ తో జూనియర్ డాక్టర్ పై దాడి చేసినట్లుగా సమాచారం అందుతోంది. 

దాడికి నిరసనగా గాంధీ ఆస్పత్రి వైద్యులు ఆందోళనకు దిగారు. కరోనాతో మృతి చెందిన ఓ రోగి బంధువులు ఐసీయూలో వైద్యుడిపై దాడికి దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడంటూ వారు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో వైద్యులు ధర్నాకు దిగారు. ఆస్పత్రి ముందు నిరసనకు దిగారు. పోలీసులు కూడా గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు.

ఈ నేపథ్యంలో డాక్టర్లపై దాడులు చేయడం సమంజసం కాదన్నారు. ఇటువంటి దాడులను ఎట్టి ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు. జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి గాంధీ ఎమర్జెన్సీ వార్డు బయట ధర్నా చేస్తున్నారు. అయితే వారిని సముదాయించడానికి గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్, వైద్యులందరూ అక్కడ ఉన్నా కూడా దాడులను ఖండిస్తూ ధర్నాకు దిగారు. 

ఎట్టిపరిస్థితుల్లో డీఎమ్ ఈ దిగి రావాలి, తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా మొదలైనప్పటి నుంచి డాక్టర్లపై దాడులు చేయడం ఇది మూడోసారని వైద్యులంతా ఆందోళన చేస్తున్నారు.