Crime News: మహబూబాబాద్‌ మున్సిపాలిటీలో కౌన్సిలర్ దారుణ హత్య

మహబూబాబాద్‌లో మున్సిపాలిటీలో దారుణం చోటు చేసుకుంది. 8వ వార్డు కౌన్సిలర్ బానోతు రవి (32) దారుణ హత్యకు గురయ్యాడు. ట్రాక్టర్ తో ఢీకొట్టి, గొడ్డలితో నరికి గుర్తు తెలియని...

Crime News: మహబూబాబాద్‌ మున్సిపాలిటీలో కౌన్సిలర్ దారుణ హత్య

Muredr

Crime News: మహబూబాబాద్‌లో మున్సిపాలిటీలో దారుణం చోటు చేసుకుంది. 8వ వార్డు కౌన్సిలర్ బానోతు రవి (32) దారుణ హత్యకు గురయ్యాడు. ట్రాక్టర్ తో ఢీకొట్టి, గొడ్డలితో నరికి గుర్తు తెలియని వ్యక్తులు దారుణ హత్యకు పాల్పడ్డారు. మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారులతో మాట్లాడి పత్తిపాకలోని తన స్నేహితుడి ఇంటి సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్టర్ తో ఢీకొట్టి కొందపడేశాడు. వెంటనే మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో దాడిచేసి అక్కడి నుండి పరారయ్యారు.

Crime news : ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన ఇల్లాలు.. మూడ్నెళ్ల తరువాత వీడిన మిస్టరీ.. ఎలా దొరికారంటే?

స్థానికులు గమనించి వెంటనే రవిని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటికే రవి ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. రవి హత్య విషయం తెలుసుకున్న స్థానికులు, బంధువులు ఏరియా ఆస్పత్రికి చేరుకొని ఆందోళనకు దిగారు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కౌన్సిలర్ మృత దేహాన్ని ఎంపీ మాలోత్ కవిత, డీసీసీ అధ్యక్షుడు భరత్ చంద్రారెడ్డి పరిశీలించారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొనే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ సంఖ్యలో బందోబస్తుకు చేరుకున్నారు.