Fake Currency : ఈ భార్యాభర్తలు మహాముదుర్లు, అప్పులు తీర్చేందుకు ఏకంగా ఇంట్లోనే..

నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఓ కిలాడీ జంటకు చెక్ పెట్టారు వరంగల్ పోలీసులు. నకిలీ నోట్లను ముద్రించడమే కాకుండా వాటిని మార్కెట్ లో చెలామణి చేస్తున్న భార్యాభర్తలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. దంపతుల నుంచి సుమారు 10లక్షల 9వేల 960రూపాయల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. అలాగే కలర్ ప్రింటర్, బాండ్ పేపర్లను సీజ్ చేశారు.

Fake Currency : ఈ భార్యాభర్తలు మహాముదుర్లు, అప్పులు తీర్చేందుకు ఏకంగా ఇంట్లోనే..

Fake Currency

Fake Currency : నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఓ కిలాడీ జంటకు చెక్ పెట్టారు వరంగల్ పోలీసులు. నకిలీ నోట్లను ముద్రించడమే కాకుండా వాటిని మార్కెట్ లో చెలామణి చేస్తున్న భార్యాభర్తలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. దంపతుల నుంచి సుమారు 10లక్షల 9వేల 960రూపాయల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. అలాగే కలర్ ప్రింటర్, బాండ్ పేపర్లను సీజ్ చేశారు.

నిందితులను కాశీబుగ్గ తిలక్ రోడ్డు ప్రాంతానికి చెందిన వంగరి రమేష్, సరస్వతి దంపతులుగా పోలీసులు గుర్తించారు. ఈ దంపతులు పలు వ్యాపారాలు చేస్తున్నారు. అయితే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయారు. దీంతో అప్పుల నుంచి బయటపడేందుకు, సులువుగా డబ్బు సంపాదించడం కోసం అడ్డదారి తొక్కారు. ఇందులో భాగంగా నకిలీ కరెన్సీ ముద్రణకు తెరలేపారు. ఇందుకు అవసరమైన కలర్ ప్రింటర్, బాండ్ పేపర్లు కొనుగోలు చేశారు. ఇంట్లోనే ముద్రణ ప్రారంభించారు. మూడు నెలలుగా ఇలా మోసానికి పాల్పడ్డారు. ఇందులో రూ.10 నుంచి రూ.2వేల నోటు వరకు కొత్త పాత కరెన్సీని ముద్రించారు. ఆ నకిలీ కరెన్సీనీ నగరానికి తీసుకెళతారు. రద్దీగా ఉండే షాపులకు వెళ్లి చెలామణి చేసినట్టు పోలీసులు గుర్తించారు.

వరంగల్ ట్రై సిటీ పరిధిలోని షాపుల్లో నకిలీ నోట్ల చెలామణి అవుతున్నట్టు ఫిర్యాదులు అందాయని సీపీ తరుణ్ జోషి తెలిపారు. దీంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగారు. దొంగ నోట్ల ముఠాను గుర్తించారు. నకిలీ కరెన్సీ ముద్రిస్తున్న రమేష్, సరస్వతి దంపతుల ఆట కట్టించారు పోలీసులు. వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

వంగరి రమేష్, సరస్వతి దంపతులు కాశీబుగ్గ ప్రాంతంలోనే చికెన్ సెంటర్‌తో పాటుగా ఫ్యాన్సీ షాప్, మ్యారేజ్ బ్యూరో నిర్వహించేవారని పోలీసులు తెలిపారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ కిలాడీ దంపతులు నకిలీ నోట్ల ముద్రణ తలపెట్టారని పోలీసులు తెలిపారు. వాటిని రద్దీ ప్రాంతాల్లోని మార్కెట్లలో వివిధ కొనుగోళ్లకు వాడుతుండేవారు.

ఇందులో భాగంగా ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న స్కానర్‌తో కూడిన కలర్ ప్రింటర్‌తో పాటు కరెన్సీకి అవసరమైన బాండ్ పేపర్లను కొని, గత మూడు నెలలుగా అసలు కరెన్సీకి సంబంధించిన రూ.2వేలు, రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 కొత్త, పాత నోట్లను ముందుగా స్కానర్‌తో స్కాన్ చేశారు. తర్వాత స్కాన్ చేసిన నోట్లను కలర్ ప్రింటర్ ద్వారా నకిలీ కరెన్సీగా ముద్రించేవారని తెలిపారు. ఎవరికీ అనుమానం రాకుండా హన్మకొండ, వరంగల్‌లో రద్దీగా వుండే షాపుల్లో ఫేక్ కరెన్సీ చెలామణి చేసేవారు.