Couple Eloped : ఆ ఇంట్లో భార్య.. ఈ ఇంట్లో భర్త మిస్సింగ్…..

వివాహేతర సంబంధాలతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిసినా కొంతమంది వాటిపట్ల మోజు పెంచుకుంటూనే ఉన్నారు.  వేర్వేరు వ్యక్తులతో పెళ్లైన ఓ జంట వారి, వారి కుటుంబాలను వదిలేసి పారిపోయిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

Couple Eloped : ఆ ఇంట్లో భార్య.. ఈ ఇంట్లో భర్త మిస్సింగ్…..

Couple Eloped

Couple Eloped : వివాహేతర సంబంధాలతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిసినా కొంతమంది వాటిపట్ల మోజు పెంచుకుంటూనే ఉన్నారు.  వేర్వేరు వ్యక్తులతో పెళ్లైన ఓ జంట వారి, వారి కుటుంబాలను వదిలేసి పారిపోయిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని  కృష్ణానగర్ లో నివసించే యువకుడు (31) రామచంద్రాపురం లోని ఓ బైక్ షోరూంలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. అతనికి 8 ఏళ్ల క్రితం పెళ్ళయ్యింది. భార్య(30) కూతురు(8) కొడుకు(4)లతో ఆనందంగా జీవిస్తున్నాడు.

అతను పని చేస్తున్న షోరూంలోనే సహోద్యోగి అయిన (21) మహిళతో అతనికి పరిచయం పెరిగింది. వారిద్దరూ ఫోన్ లో చాటింగ్ లు చేసుకుంటున్నారు. ఇలా ఉండగా మూడు రోజుల క్రితం అతను చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు.

భర్త ఆచూకి గురించి ఎంత గాలించినా ప్రయోజనం లేకపోవటంతో భార్య జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా సహోద్యోగి మహిళ (21) తో చాటింగ్ చేసినట్లు గుర్తించి…ఆ మహిళతోనే కలిసి వెళ్లినట్లు అభిప్రాయానికి వచ్చారు.

మరోవైపు ఆ మహిళ భర్త కూడా తన భార్య కనిపించటం లేదని చందా నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో రెండు స్టేషన్ల పోలీసులు తలలు పట్టుకున్నారు. మిస్సింగైన ఇద్దరూ మేజర్లే కావటంతో సమస్య ఎటు దారితీస్తుందోనని చూస్తున్నారు.  వాళ్లిద్దరూ  ప్రత్యక్షమైతేనే  ఏమైందో….ఏమిటో తెలిసే అవకాశం ఉంది.