Couple Eloped : ఆ ఇంట్లో భార్య, ఈ ఇంట్లో భర్త పరార్… బాధితులు ఇద్దరూ ఒకేసారి ఫిర్యాదు

హైదరాబాద్ జూబ్లీ‌హిల్స్ పోలీసు స్టేషన్‌లో విచిత్రమైన కేసు నమోదైంది. తన భార్య కనిపించటం లేదని ఒక వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేయగా ....నా భర్త అతడి భార్యతోనే కలిసి పారిపోయిందని మరో మహిళ వచ్చి ఫిర్యాదు చేసింది.

Couple Eloped : ఆ ఇంట్లో భార్య, ఈ ఇంట్లో భర్త పరార్… బాధితులు ఇద్దరూ ఒకేసారి ఫిర్యాదు

Couple Missing In Jubilee Hills Police Station

Couple Eloped : హైదరాబాద్ జూబ్లీ‌హిల్స్ పోలీసు స్టేషన్‌లో విచిత్రమైన కేసు నమోదైంది. తన భార్య కనిపించటం లేదని ఒక వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేయగా ….నా భర్త అతడి భార్యతోనే కలిసి పారిపోయిందని మరో మహిళ వచ్చి ఫిర్యాదు చేసింది. రెండు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

వివరాల్లోకి వెళితే ….పశ్చిమ బెంగాల్‌లోని కొల్‌కతాకు చెందిన బి.నారాయణదాస్, మోనికా‌దాస్ దంపతులు బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. యూసఫ్‌గూడ సమీపంలోని వెంకటగిరిలో ఉంటూ ప్లంబర్‌గా పనిచేసుకుని జీవనం సాగిస్తున్నాడు నారాయణ‌దాస్.

గతేడాది కాలంగా మోనికా‌దాస్,  ఎండీ ఆసిఫ్ అనే వ్యక్తితో ఫోన్‌లో తరచూ మాట్లాడటం గమనించాడు. పరాయి పురుషులతో అంతంత సేపు మాటలెందుకని నారాయణదాస్ భార్యను మందలించాడు. ఈ విషయంలో భార్యా, భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటే పెద్దమనుషులు సర్ది చెప్పారు.

ఈ క్రమంలో జూన్ 24వ తేదీన భర్త నారాయణదాస్ ఇంట్లో లేని సమయంలో మోనికా‌దాస్ తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని కొల్‌కతా వెళ్లిపోయింది. నారాయణదాస్ భార్య గురించి ఎంక్వైరీ చేసి కొల్‌కతా వాకబు చేయగా పిల్లలను తల్లి వద్ద వదిలేసి వెళ్లినట్లు తెలుసుకున్నాడు.

దీంతో ఆదివారం జూబ్లీ‌హిల్స్ పోలీస్ స్టేషన్‌లో తన భార్య కనిపించటం లేదంటూ ఫిర్యాదు చేశాడు. అనుమానితుడి పేరు కూడా తన ఫిర్యాదులో రాశాడు.  అదే సమయంలో తన భర్త కనిపించటం లేదంటూ ఆసిఫ్ భార్య కూడా వచ్చి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు అవాక్కయ్యారు. ఇద్దరి వద్ద ఫిర్యాదులు తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.