బాలికపై హత్యాచారం కేసు..కామాంధుడికి మరణ శిక్ష

  • Published By: madhu ,Published On : December 27, 2019 / 12:07 PM IST
బాలికపై హత్యాచారం కేసు..కామాంధుడికి మరణ శిక్ష

ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి..దారుణంగా హత్య చేసిన కామాంధుడికి మరణ శిక్షణను విధించింది కోర్టు. ఇది కోయంబత్తూరులో జరిగింది. POCSO కేసులను విచారించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు నిందితుడు సంతోష్ కుమార్‌కు మరణ శిక్షను విధిస్తూ సంచలనం తీర్పును వెలువరించింది. సీఆర్పీసీ సెక్షన్ 173 కింద తదుపరి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సంవత్సరం మార్చిలో తుడియార్‌లో ఆరేళ్ల బాలికపై సంతోష్ కుమార్ అత్యాచారం జరిపి హత్య చేశాడు. బాధితురాలిని హత్య చేసినందుకు సంతోష్ కుమార్‌ను ఉరి తీయాలని మహిళా కోర్టు న్యాయవాది రాధిక కోర్టును అభ్యర్థించారు. 

ఫోరెన్సిక్ నివేదికలో పేర్కొన్న వాటి ఆధారంగా కేసును పున:పరిశీలించాలని బాధితురాలి తల్లి కోర్టులో డిసెంబర్ 26వ తేదీ గురువారం పిటిషన్ దాఖలు చేసింది. బాధితుడి శరీరం నుంచి తీసిన శాంపిల్స్, డీఎన్ఏ ఆధారంగా సంతోష్ కుమార్ కాకుండా..మరో ఇద్దరు వ్యక్తులున్నట్లు నివేదికలో ఉంది. 

మార్చిలో బాలిక ఇంటినుంచి తప్పిపోయింది. అదే రోజు తల్లిదండ్రులు పీఎస్‌లో కంప్లయింట్ చేశారు. ఆమె ఇంటికి దగ్గరలోనే బాలిక మృతదేహం కనిపించింది. లైంగిక వేధింపులకు గురి చేశారని రిపోర్టులో వెల్లడైంది. వారం రోజుల తర్వాత సమీపంలో నివాసం ఉంటున్న సంతోష్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారించారు. బాలిక ఆడుకుంటూ కిందపడిపోగా..ఇతను సహాయం చేస్తూ..ఇంటికి తీసుకెళ్లి రెండు సార్లు అత్యాచారం జరిపాడని పోలీసులు నిర్ధారించారు. అనంతరం బాలికను చంపేశాడని వెల్లడించారు. మృతదేహాన్ని తరలించేందుకు నిందితుడి నాన్నమ్మ సహకరిచిందని గుర్తించారు.