ఉరి శిక్ష వేస్తారా : చిన్నారి వర్షిత అత్యాచారం, హత్య కేసులో నేడు తీర్పు

తీర్పు ఇవ్వనుంది. 2019 నవంబర్ 6న చిన్నారి వర్షితను కిడ్నాప్ చేసిన నిందితుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. బసినికొండకు చెందిన లారీ క్లీనర్ మహమ్మద్ రఫీ ఈ

  • Published By: veegamteam ,Published On : February 17, 2020 / 03:30 AM IST
ఉరి శిక్ష వేస్తారా : చిన్నారి వర్షిత అత్యాచారం, హత్య కేసులో నేడు తీర్పు

తీర్పు ఇవ్వనుంది. 2019 నవంబర్ 6న చిన్నారి వర్షితను కిడ్నాప్ చేసిన నిందితుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. బసినికొండకు చెందిన లారీ క్లీనర్ మహమ్మద్ రఫీ ఈ

ఏపీలో సంచలనం రేపిన చిత్తూరు జిల్లాకి చెందిన 6 ఏళ్ల చిన్నారి వర్షిత హత్య కేసులో నేడు(ఫిబ్రవరి 17,2020) తుది తీర్పు వెలువడనుంది. చిత్తూరు మొదటి అదనపు జిల్లా కోర్టు తీర్పు ఇవ్వనుంది. 2019 నవంబర్ 7న చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేత నగర్‌లోని ఒక కళ్యాణ మండపానికి తల్లిదండ్రులతో పెళ్లికి వెళ్లిన చిన్నారి వర్షిత హత్యాచారానికి గురైంది. చిన్నారి వర్షితను హతమార్చింది మదనపల్లి మండలం బసినికొండ గ్రామానికి చెందిన లారీ క్లీనర్ మహమ్మద్ రఫీగా తేల్చారు పోలీసులు.

నిందితుడు రఫీని నవంబర్ 16న అరెస్టు చేసిన పోలీసులు.. అతనిపై హత్య, పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదికను పరిశీలించి 17 రోజుల్లోనే చార్జిషీట్ దాఖలు చేశారు పోలీసులు. ఈ కేసులో 41 మంది సాక్షులను విచారించింది న్యాయస్థానం. విచారణ పూర్తయిన నేపథ్యంలో కేసుపై నేడు తీర్పు వెల్లడించనుంది చిత్తూరు సెషన్స్ కోర్టు.

తీర్పు నేపథ్యంలో చిత్తూరు మొదటి అదనపు జిల్లా కోర్టు పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తారోనని ఎదురుచూస్తున్నారు. చిన్నారిని పొట్టన పెట్టుకున్న రఫీకి ఉరి శిక్ష విధించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిర్భయ, హాజీపూర్ హత్యాచారం కేసుల్లో దోషులకు ఉరిశిక్ష పడిన సంగతి తెలిసిందే. 

బి.కొత్తకోట మండలం గట్టు పంచాయతీ గుట్టపాలెంకు చెందిన సిద్దారెడ్డి, ఉషారాణి దంపతులకు వైష్ణవి, వర్షిణి, వర్షిత ముగ్గురు కుమార్తెలున్నారు. 2019 నవంబర్‌ 7న అంగల్లు సమీపంలోని చేనేత నగర్‌లో ఉన్న కెఎన్‌ఆర్‌ కల్యాణ మండపంలో బంధువుల పెళ్లి ఉండటంతో సిద్ధారెడ్డి కుటుంబ సభ్యులంతా వెళ్లారు. అంతకుముందు రాత్రి 10 గంటల వరకు ఉత్సాహంగా ఆడుకున్న చిన్నారి వర్షిణి ఒక్కసారిగా మాయమైపోయింది. చిన్నారి కోసం కళ్యాణ మండపమంతా వెతికినా ఎక్కడా కనపడలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఆ సీసీ ఫుటేజీల్లో రఫీ చిన్నారిని కిడ్నాప్‌ చేసినట్లు తేలింది. 

సీన్‌ కట్‌ చేస్తే….తెల్లవారుజామున పెళ్లి జరిగిన ఫంక్షన్ హాల్‌కు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో చిన్నారి మృతదేహం లభ్యమైంది. కుమార్తె విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. అప్పటి వరకు ఆడుకుంటూ ఉన్న కూతురు…శవంగా మారడం చేసి కన్నీరుమున్నీరయ్యారు. బాలికను కిడ్నాప్‌ చేసి.. అత్యాచారం చేసి దారుణంగా చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది.

ఆరేళ్ల వర్షితపై లైంగిక దాడి చేసి హత్య చేసింది లారీ క్లీనర్ రఫీగా పోలీసులు తేల్చారు. సీఎం జగన్‌ ఆదేశాలతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. ఇదివరకే గ్రామంలో చిన్నారి వర్షిత పట్ల లారీ క్లీనర్ రఫీ అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అన్ని కోణాల్లో విచారణ జరిపి చివరికి హంతకుడిని పట్టుకున్నారు. చిన్నారి హత్య కేసులో రఫీపైనే అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసుల ఆ దిశగా దర్యాప్తు చేశారు. లారీ క్లీనర్‌గా పని చేస్తున్న రఫీ స్వస్థలం మదనపల్లె మండలం బసినికొండ.

rafi

రఫీ ప్రవర్తన సరిగా లేదని భార్య అతడ్ని వదిలేసి వెళ్లిపోయింది. అప్పటి నుంచి రఫీ జులాయిగా తిరుగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. రఫీ గతంలోనూ చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఓ కేసులో రెండు నెలలు జైల్లో కూడా ఉండి వచ్చాడు. తర్వాత కూడా పద్దతి మార్చుకోని రఫీ.. మళ్లీ వర్షితపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి హత్య తర్వాత రఫీ కూడా ఊరిలో కనిపించకపోవడంతో అనుమానాలు పెరిగాయి. పైగా మొబైల్‌ స్విచ్చాఫ్ ఉండడంతో అతడిపై అనుమానం వచ్చిన పోలీసులు 6 బృందాలతో ఏర్పడి చత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో అదుపులోకి తీసుకున్నారు.