Covid Patient: కరోనా రోగిపై అత్యాచారం.. 24 గంటల్లో మహిళ మృతి

వైద్యం అందించాల్సిన వ్యక్తి కరోనా పేషెంట్ పై కన్నేశాడు. కరోనా రోగిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే 43 ఏళ్ల మహిళ కరోనాతో బాధపడుతూ ఏప్రిల్ 6 న భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో చేరింది. ఆ సమయంలో తనపై నర్సు అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది.

Covid Patient: కరోనా రోగిపై అత్యాచారం.. 24 గంటల్లో మహిళ మృతి

Covid Patient

Covid Patient: వైద్యం అందించాల్సిన వ్యక్తి కరోనా పేషెంట్ పై కన్నేశాడు. కరోనా రోగిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే 43 ఏళ్ల మహిళ కరోనాతో బాధపడుతూ ఏప్రిల్ 6 న భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో చేరింది. ఆ సమయంలో తనపై నర్సు అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు చేసిన సమయంలో మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు.

అయినా ఆమె కోలుకోలేదు చికిత్స పొందుతూ 24 గంటల్లోనే మృతి చెందింది. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు పోలీసులు.. విచారణలో 40 ఏళ్ల సంతోష్ అహిర్ వార్ మహిళపై అత్యచారానికి పాల్పడినట్లు పోలీసులు నిర్దారించారు. అతడిని అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు. అయితే ఇంతకాలం ఈ ఘటనను గోప్యంగా ఉంచారు. ఈ కేసు సమాచారం దర్యాప్తు బృందం వద్ద తప్ప మరే ఇతర అధికారుల వద్ద లేదని సీనియర్ పోలీస్ అధికారి ఇర్హాద్ వాలి తాజాగా మీడియాకు తెలిపారు. కాగా నిందితుడు సంతోష్ పై గతంలో కూడా రేప్ కేసు ఉంది.

మద్యం మత్తులో 24 ఏళ్ల మహిళ నర్సుపై అత్యాచారానికి పాల్పడి జైలు శిక్ష కూడా అనుభవించాడు. అయినా కూడా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. కాగా ప్రస్తుతం నిందితుడు భోపాల్ జైల్లో ఉన్నాడు. ఇక మృతి చెందిన మహిళ 1984 భోపాల్ గ్యాస్ విషాదంలో ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. అయితే ఆసుపత్రిలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దర్యాప్తు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా పరమైన లోపాలున్నాయని పేర్కొంటూ హాస్పిటల్‌ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేసింది.