Gold Seized In Shamshabad Airport : ఏం తెలివి.. అండర్ వేర్‌లో దాచి అరకిలో బంగారం స్మగ్లింగ్.. అయినా దొరికిపోయారు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు వేర్వేరు ఘటనల్లో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Gold Seized In Shamshabad Airport  : ఏం తెలివి.. అండర్ వేర్‌లో దాచి అరకిలో బంగారం స్మగ్లింగ్.. అయినా దొరికిపోయారు

 

Gold Seized In Shamshabad Airport : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు వేర్వేరు ఘటనల్లో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి 1,278 గ్రాముల గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 67లక్షల 56వేలు ఉంటుందని అధికారులు తెలిపారు.

అటు దుబాయ్ నుంచి ఇద్దరు భారతీయ ప్రయాణికుల నుంచి 25లక్షల 74వేల విలువ చేసే 498 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. లోదుస్తులు, చొక్కాల్లో స్ప్రే చేసి బంగారాన్ని దాచిపెట్టారు. వీరి నుంచి గోల్డ్ తో పాటు స్ప్రే ఫారమ్, చైన్ ఫారమ్ స్వాధీనం చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో తరుచుగా గోల్డ్ స్మగ్లింగ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. అధికారులు కఠిన నిఘా పెడుతున్నా గోల్డ్ స్మగ్లింగ్ ఆగడం లేదు. బంగారం అక్రమ రవాణలో అక్రమార్కులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. బంగారం అక్రమ రవాణా చేయడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నా గోల్డ్ స్మగ్లింగ్ కు శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. పురుషులు మాత్రమే కాదు విద్యార్థులు, మహిళలు సైతం విదేశాల నుండి బంగారం అక్రమ రవాణాకు ఎవరికీ దొరకకుండా రకరకాల మార్గాల ద్వారా ప్రయత్నిస్తున్నారు.

గోల్డ్ స్మగ్లింగ్ కోసం అండర్ వేర్ లను కూడా వాడేస్తున్నారు. లోదుస్తుల్లో అయితే ఎవరికీ అనుమానం రాకుండా ఉంటుందనే బలమైన నమ్మకంతో ఇలా బరి తెగిస్తున్నారు. అయినా వారి ఆటలు సాగడం లేదు. ప్రయాణికుల కదలికలపై ఏమాత్రం అనుమానం వచ్చినా.. కస్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అక్రమార్కుల గుట్టు రట్టు చేస్తున్నారు.

బంగారం అక్రమ రవాణ చేస్తూ దొరికిపోతే కేసుల్లో ఇరుక్కుంటారని, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని కస్టమ్స్ అధికారులు, ఎయిర్ పోర్ట్ పోలీసులు హెచ్చరిస్తున్నా.. అక్రమార్కుల్లో మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఒక రకంగా అడ్డదారిలో బంగారం అక్రమ రవాణ చేయడానికి ప్రయత్నిస్తూ.. కస్టమ్స్ అధికారులకు, ఎయిర్ పోర్ట్ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు.