ఇండియాలో సైబర్ నేరగాళ్ల టార్గెట్ ఎప్పుడూ ఈ సర్వీసు మీదే.. పోలీసుల హెచ్చరిక!

  • Published By: sreehari ,Published On : June 29, 2020 / 04:28 PM IST
ఇండియాలో సైబర్ నేరగాళ్ల టార్గెట్ ఎప్పుడూ ఈ సర్వీసు మీదే.. పోలీసుల హెచ్చరిక!

ఆన్‌లైన్ మోసాలలో బిజినెస్ ఇ-మెయిల్ సర్వీసుపైనే దాదాపుగా సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తుంటారని ఢిల్లీ పోలీసు అధికారి చెప్పారు. పిహెచ్‌డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన వెబ్నార్‌లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సైబర్) అన్యేష్ రాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బిజినెస్ ఇ-మెయిల్ లపై సైబర్ క్రైమ్.. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను తీవ్ర ప్రభావితం చేస్తుందని అన్నారు. సైబర్ మోసగాళ్లు.. కంపెనీ అకౌంట్లు, ఆర్థిక లావాదేవీలతో వ్యవహరించే వ్యక్తి ఈ-మెయిల్ అకౌంట్లతో డేటా చోరీకి పాల్పడుతుంటారని రాయ్ హెచ్చరించారు.

కంపెనీ లేదా క్లయింట్ అకౌంట్‌కు సమానమైన ఇమెయిల్ అకౌంట్‌ను క్రియేట్ చేస్తారని, మధ్యలో వచ్చి రెండు పార్టీలతో సైబర్ నేరగాళ్లు సంభాషించడం ప్రారంభిస్తారని హెచ్చరిస్తున్నాు. అంతేకాదు.. కొన్ని సాకులతో ఆర్థిక లావాదేవీలను తమకు అనుకూలంగా మార్చుకుంటారని చెప్పారు. ఆ తర్వాత వ్యాపార అకౌంట్లలో డబ్బు మోసగాళ్ల అకౌంట్లకు వెళుతుందని రాయ్ తెలిపారు. ఒక వ్యక్తి తన ఇమెయిల్ అకౌంట్‌ను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచిస్తున్నారు. అకౌంట్ దారులు తమ ఆర్థిక లావాదేవీలు, ఇన్వాయిస్‌లను బిజినెస్ ఈమెయిల్ ద్వారానే పంపబడుతున్నారని అన్నారు.

బ్యాంకింగ్ అకౌంట్ మార్చడంపై క్లయింట్ నుంచి సూచనలు వచ్చినప్పుడల్లా.. ఫోన్ కాల్, ఇ-మెయిల్ సహా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ధృవీకరించాలని అధికారి చెప్పారు. ఉచిత ఈ-మెయిల్ సేవలను ఉపయోగించుకునే బదులు, పెద్ద టర్నోవర్ ఉన్న సంస్థలు తమ సొంత డొమైన్‌కు మారాలని, సరిగ్గా హోస్ట్ చేసిన ఇ-మెయిల్ సేవను కలిగి ఉండాలని రాయ్ చెప్పారు. సైబర్ క్రైమ్‌కు మరొక మార్గం ransomware.. ఇది ఒక రకమైన మాలిసియస్ సాఫ్ట్‌వేర్.. నగదు మొత్తాన్ని చెల్లించే వరకు కంప్యూటర్ సిస్టమ్‌కు యాక్సస్ బ్లాక్ చేసేందుకు రూపొందించారని తెలిపారు.

బ్యాకప్ క్లౌడ్స్, లాకింగ్ సిస్టమ్స్, మల్టీపుల్ లెవల్ సెక్యూరిటీ వంటివి ఒక వ్యక్తిని ఈ రకమైన మోసం నుంచి రక్షించగలవని రాయ్ చెప్పారు. సైబర్ నేరం ఇతర నేరాల మాదిరిగానే ఉంటుంది. దానిని ఏదైనా పోలీస్ స్టేషన్ లేదా DCP కార్యాలయంలో ఎక్కడైనా నివేదించవచ్చు. ఫిర్యాదును ఇ-మెయిల్ ద్వారా కూడా నమోదు చేయవచ్చు. సైబర్ నేరాలు డిజిటల్ మాధ్యమం ద్వారా జరుగుతున్నాయి. సాక్ష్యాలను సులభంగా నాశనం చేయవచ్చు. బాధితులు దానిని వెంటనే స్క్రీన్‌షాట్‌ తప్పక తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఆ సాక్ష్యాన్ని వారి ఫిర్యాదుతో కలిపి పోలీసులకు ఇవ్వాలని రాయ్ సూచించారు.

Read:PUBGకు బానిసై సూసైడ్ చేసుకున్న యువకుడు