Cyber Criminals Cheated : మహిళ పేరుతో పరిచయం…న్యూడ్ వీడియోలతో రూ.10లక్షలు కొట్టేసిన సైబర్ నేరస్తులు

Cyber Criminals Cheated : మహిళ పేరుతో పరిచయం…న్యూడ్ వీడియోలతో రూ.10లక్షలు కొట్టేసిన సైబర్ నేరస్తులు

Sextraction Hyderabad

Cyber Criminals Cheated Hyderabad Event Manager : సోషల్ మీడియా వేదికగా సెక్సట్రాక్షన్ చేసి డబ్బులు దండుకునే ముఠాలు రాన్రాను పెరిగి పోతున్నాయి. ఆడవాళ్లపై ఉన్నవ్యామోహంతో పురుషులను టార్గెట్ చేసుకునే మోసగాళ్లు ఎక్కువైపోయీరు. అబ్బాయిలే అమ్మాయిలగా చాట్ చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ లో ఈ రకమైన కేసుల సంఖ్య రాన్రాను పెరుగుతోంది. తాజాగా తార్నాకాకు చెందిన ఒక వ్యక్తి వీరి చేతిలో రూ.10లక్షలు నష్టపోవటంతో పోలీసులను ఆశ్రయించాడు.

హైదరాబాద్ తార్నాకాలో నివసించే ఈవెంట్ మేనేజర్ ఫేస్ బుక్ ఎకౌంట్ కు కొన్నాళ్ల క్రితం ఒక యువతి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దాన్ని ఆయన యాక్సెప్ట్ చేశాడు. అప్పటి నుంచి ఆమె అతనికి ఫ్రెండ్ గా మారింది. ఆ తర్వాత కాలంలో ఆయువతి ఈవెంట్ మేనేజర్ తో మెసెంజర్ లో చాటింగ్ చేయటం మొదలెట్టింది. ఆ పరిచయంతో ఇద్దరూ మరింత చనువుగా సెక్స్ చాటింగ్ చేయటం మొదలెట్టారు. ఆతర్వాత ఒకరి వాట్సప్ నెంబర్ ఒకళ్లు తెలుసుకుని అందులో సెక్స్ చాటింగ్ చేసుకోవటం మొదలెట్టారు.

ఇంటర్నెట్ లో డౌన్లోడ్ చేసిన పోర్న్ వీడియోలు ప్రత్యేకయాప్ ద్వార్ తమ ఫోన్ లో ప్లే చేసి చూపించింది. దీంతో ఆ యువతి తనతో నగ్నంగా మాట్లాడుతోందని ఫీలయ్యాడు. ఇలా ఒకటి రెండుసార్లు చేసి, ఈవెంట్ మేనేజర్ కూడా నగ్నంగా వీడియో కాల్ చేసేలా రెచ్చగొట్టింది. దీంతో అతను కూడా నగ్నంగా వీడియో కాల్ చేసి మాట్లాడాడు. అతను నగ్నంగా వీడియో కాల్ చేసిన దృశ్యాలను స్క్రీన్ రికార్డు చేసింది. వాటిని యూ ట్యూబ్ చానల్ లో అప్ లోడ్ చేసి లింక్ పంపించింది. ఇది చూసి కంగారు పడిన ఆవ్యక్తి సదరు యువతికి ఫోన్ చేశాడు.

అప్పుడు అర్ధమైంది ఈవెంట్ మేనేజర్ కు. అవతల ఉన్నది ఆమె కాదు అతడు అని. మహిళ పేరుతో ఇన్నాళ్లు తనతో చాటింగ్ చేసి పురుషుడు అని తెలుసుకున్నాడు. సరే విషయం ఏంటని అడిగాడు. రూ.10లక్షలు ఇస్తే రిమూవ్ చేస్తా అని చెప్పాడు అవతలి వ్యక్తి. తప్పనిసరి పరిస్ధితుల్లో సైబర్ నేరగాడు ఇచ్చినఖాతాకు రూ. 10 లక్షలు ట్రాన్సఫర్ చేశాడు. మళ్లీ కొద్దిరోజులకే ఫోన్ చేసి మళ్లీ డిమాండ్ చేయటం ప్రారంభించాడు. ఇవ్వక పోయేసరికి వేధింపులు ఎక్కవయ్యాయి. దీంతో భాధితుడు శుక్రవారం హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకున్నపోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.