లోన్లు ఇప్పించి మరీ.. లూటీ చేశారు

  • Published By: bheemraj ,Published On : July 30, 2020 / 07:44 PM IST
లోన్లు ఇప్పించి మరీ.. లూటీ చేశారు

నమ్మకంగా ఓటీపీలు అడిగి.. సర్వం ఊడ్చేస్తున్నారు. వద్దన్నా.. లోన్లు ఇప్పించి మరీ.. లూటీ చేస్తున్నారు. కేవైసీల పేరుతో మాయ చేసి.. డబ్బులు మాయం చేస్తున్నారు. ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్‌లో ఊహించనంత దండుకుంటున్నారు. ఈ లాక్ డౌన్, కరోనా టైమ్‌లోనే.. వేలల్లో కేటుగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడ్డారు. లక్షల్లో స్వాహా చేయడంతో.. ఇప్పుడు వందల్లో ఫిర్యాదులు వస్తున్నాయ్. లాక్ డౌన్ టైమ్‌ని.. కరోనా కంత్రీగాళ్లు ఖతర్నాక్‌గా క్యాష్ చేసుకున్నారు.

వేలల్లో మోసాలు.. వందల్లో ఫిర్యాదులు.. లక్షల్లో డబ్బులు మాయం. మోసపోయేందుకు మీరు రెడీగా ఉంటే చాలు.. మోసం చేసేందుకు.. చాలా కంత్రీగాళ్లు సిద్ధంగా ఉన్నారు. అవగాహన లేకుండా.. అమాయకంగా వ్యవహరిస్తే.. అదిరిపోయే షాక్ తప్పదని మళ్లీ రుజువు చేశారు. లాక్ డౌన్ కాలాన్ని.. కరోనా టైమ్‌ని.. కంత్రీగాళ్లు బాగా క్యాష్ చేసుకున్నారు. ఇందుకు.. తెలుగు రాష్ట్రాల్లో వెల్లువెత్తుతున్న సైబర్ నేరాల ఫిర్యాదులే బిగ్ ఎగ్జాంపుల్.
లాక్ డౌన్ కారణంగా.. కొందరి వ్యాపారాలు దెబ్బతిన్నాయ్. ఇంకొందరు ఉపాధి కోల్పోయారు. చాలా మంది చాలా రకాలుగా.. నష్టపోయారు. కానీ.. లాక్ డౌన్ టైమ్‌ని, కరోనా కాలాన్ని.. సైబర్ నేరగాళ్లు ఓ రేంజ్‌లో క్యాష్ చేసుకున్నారు. వేల మందిని మోసం చేసి.. వాళ్ల అకౌంట్లలోని డబ్బులను స్మార్ట్‌గా లూటీ చేశారు.

బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం.. ఓటీపీ చెప్పండని కొందరు కేటుగాళ్లు.. కేవైసీ యాక్టివేట్ చేస్తాం.. డెబిట్ కార్డ్ పిన్ చెప్పండని కొందరు కంత్రీగాళ్లు.. అవసరం లేకున్నా లోన్లు ఇప్పిస్తామని కొందరు మోసగాళ్లు.. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రాంలో కొత్త కొత్త స్నేహాలు.. ముదిరాక బ్లాక్ మెయిలింగ్‌లు.. ఆన్ లైన్‌లో వస్తువులు, వాహనాల అమ్మకాల పేరుతో ఇంకొందరు.. కరోనా బాధితులకు సాయం పేరుతో.. ఫేక్ ఎన్జీవోలు క్రియేట్ చేసి మరికొందరు కేటుగాళ్లు.. ఇలా చెప్పుకుంటూ.. ఈ లిస్ట్‌కు పుల్‌స్టాప్ ఉండదు. ఎవడికి నచ్చినట్లు వాడు.. ఎవరిష్టమొచ్చినట్లు వాళ్లు..

అమాయకులను టార్గెట్ చేసుకొని.. నమ్మించి మరీ అకౌంట్లలో సొమ్మును కాజేశారు. చేస్తూనే ఉన్నారు.
కరోనా టైంలో.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో.. ఈ 10 రోజుల్లోనే 600లకు పైగా కంప్లైంట్లు వచ్చాయి. ఇవన్నీ.. సైబర్ క్రైమ్స్‌కి సంబంధించినవే. మూడు కమిషనరేట్లలో కలిపి.. 10 రోజుల్లో 130కి పైగా కేసులు నమోదు చేశారు. నగరంలో.. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల్లాగే.. సైబర్ క్రైమ్ కేసులు, కంప్లైంట్ల కౌంట్ కూడా పెరిగిపోతోంది.

మార్చ్ నుంచి హైదరాబాద్‌లో భౌతిక నేరాలు తగ్గినప్పటికీ.. సైబర్ నేరాల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. గతేడాది.. 1400కి పైగా సైబర్ నేరాలు నమోదవగా.. ఈ ఏడాది ఇప్పటివరకే.. దాదాపు 14 వందల కేసులు రికార్డయ్యాయ్. సైబర్ క్రిమినల్స్ అంతా.. ఇప్పుడు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. బ్యాంక్ అధికారులమంటూ ఫోన్ చేసి.. కస్టమర్లతో తెలివిగా మాట్లాడి.. ఓటీపీ, ఇతర వివరాలు సేకరించి.. క్షణాల్లో అకౌంట్‌ల నుంచి డబ్బులు మాయం చేసేస్తున్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డుల పిన్ నెంబర్లు తెలుసుకొని.. డబ్బులు కాజేస్తున్నారు. సైబర్‌క్రైంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా బ్యాంకింగ్‌ నేరాలే ఉంటున్నాయి.

ఆన్‌లైన్‌లో వస్తువుల అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన వెబ్‌సైట్లు, కేవైసీ నేరాలు కూడా నమోదవుతున్నాయి. గిఫ్ట్స్ వచ్చాయంటూ బురిడీ కొట్టించడంలోనూ.. సైబర్ నేరగాళ్లు కొత్త రూట్లు వెతుకుతూనే ఉన్నారు. సోషల్ మీడియాలో పరిచయాలు, తర్వాత మార్ఫింగ్ ఫోటోలతో.. మహిళలను వేధించే వారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు. ఇలాంటివన్నీ కలుపుకొని.. ప్రతి నెలా సగటున 200 కేసులు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో నమోదవుతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదవుతున్న సైబర్ నేరాల్లో.. 10 శాతం జార్ఖండ్‌లోని జమ్‌తార లింక్ ఉన్నవేనని చెబుతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ సైబర్ ముఠాలన్నీ.. అక్కడి నుంచే ఆపరేట్ అవుతున్నాయని తేల్చారు.

ఓటీవీ నేరాలు, ఈ-సిమ్, కేవైసీ ఫ్రాడ్స్ చేయడంలో.. జమ్‌తార సైబర్ ముఠాలు దిట్ట అని చెబుతున్నారు. కరోనా కారణంగా.. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా జార్ఖండ్ వెళ్లలేకపోతున్నారు. జమ్‌తారలోని సైబర్ కేటుగాళ్లు కూడా ఇదే అదనుగా భావించి.. విపరీతంగా మోసాలు చేసేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా.. పోలీసులు అంతరాష్ట్ర సరిహద్దులు దాటి.. తమను అరెస్ట్ చేసేందుకు వచ్చే చాన్సే లేదని రెచ్చిపోతున్నారు.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. గత 3 నెలల్లో దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్స్ కౌంట్ ఓ రేంజ్‌లో పెరిగింది. లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగులు ఇంటికే పరిమితం కావడం, కొన్ని సంస్థలు తక్కువ సిబ్బందితో పనిచేయడాన్ని ఆసరాగా చేసుకుని.. సైబర్ కేటుగాళ్లు ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నట్లు ఇప్పటికే చాలా రిపోర్ట్‌లు స్పష్టం చేశాయ్. మొత్తం కేసుల్లో.. దాదాపు 25 శాతం మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని చెబుతున్నారు. సైబర్ కేటుగాళ్లు మాయమాటలు చెప్పి వ్యక్తిగత వివరాలు, బ్యాంకు అకౌంట్ల సమాచారం తస్కరిస్తున్నారు. ఫిషింగ్ మెసేజెస్ పంపించి.. మోసాలకు పాల్పడుతున్నారు. క్లిక్ చేస్తే.. దిమ్మతిరిగే షాక్ తగులుతోంది.