Cyber Fraudsters : డబ్బే డబ్బు.. రాజస్తాన్‌లో సైబరాబాద్ పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ క్రిమినల్స్ నుంచి దాదాపు రూ.10 కోట్లు స్వాధీనం

సైబరాబాద్ పోలీసులు రాజస్తాన్ లో భారీ ఆపరేషన్ నిర్వహించారు. సైబర్ క్రిమినల్స్ ఆట కట్టించి అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ నుంచి డబ్బులు కొట్టేసి రాజస్తాన్ లో బిజినెస్ మేన్స్ గా చెలామణి అవుతున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి దాదాపు 10కోట్ల రూపాయల నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు.

Cyber Fraudsters : డబ్బే డబ్బు.. రాజస్తాన్‌లో సైబరాబాద్ పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ క్రిమినల్స్ నుంచి దాదాపు రూ.10 కోట్లు స్వాధీనం

Cyber Fraudsters : సైబరాబాద్ పోలీసులు రాజస్తాన్ లో భారీ ఆపరేషన్ నిర్వహించారు. సైబర్ క్రిమినల్స్ ఆట కట్టించి అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ నుంచి డబ్బులు కొట్టేసి రాజస్తాన్ లో బిజినెస్ మేన్స్ గా చెలామణి అవుతున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి దాదాపు 10కోట్ల రూపాయల నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు.

పెట్టుబడులు, ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో నిందితులు అమాయకుల నుంచి కోట్లు కొల్లగొట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. రాజస్తాన్, యూపీ కేంద్రాలుగా సైబర్ ముఠాలు పని చేస్తున్నాయని.. త్వరలోనే మరిన్ని దాడులు కూడా చేస్తామని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు. అటు, గతంలో ఎన్నడూ లేనంతగా భారీగా నగదు రికవరీ చేసి పోలీసులు రికార్డ్ క్రియేట్ చేశారు. మొదటిసారిగా భారీ మొత్తంలో డబ్బును రికవరీ చేశారు.

నిందితులు ఆన్ లైన్ లో మార్కెట్ బాక్స్ అనే ట్రేడింగ్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి తొలుత ఈ యాప్ ద్వారా 9వేల 999 రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు. ఆ మొత్తం కోల్పోయాడు. ఆ తర్వాత రూ.10లక్షలు ఇన్వెస్ట్ చేయగా రూ.14.9 లక్షలు వచ్చింది. దీంతో అతడిలో ఆశ పెరిగింది. ట్రేడింగ్ కంటిన్యూ చేశాడు. ఏకంగా 62.6 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. కట్ చేస్తే అతడికి 34.7 లక్షలు మాత్రమే వచ్చింది. అంటే 27.90 లక్షలు నష్టపోయాడు. దీంతో అతడికి జ్ఞానోదయమైంది. ఇదంతా ఫ్రాడ్ అని తెలుసుకుని షాక్ తిన్నాడు. వెంటనే సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసుని సవాల్ గా తీసుకుని నిందితులను పట్టుకున్నారు.

ఉత్తరప్రదేశ్ కు చెందిన కమోడిటీ ట్రేడర్ అభిషేక్ జైన్ ను ముందుగా పోలీసులు అరెస్ట్ చేశారు. మార్కెట్ బాక్స్ ట్రేడింగ్ యాప్ వెనుకున్న ప్రధాని సూత్రధారి ఇతడే. మార్కెట్ బాక్స్ అనే ట్రేడింగ్ అప్లికేషన్ తో పాటు మార్కెట్ బాక్స్ పేరుతో వెబ్ సైట్ డెవలప్ చేశాడు. ఆ యాప్ ను సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేశాడు. సెబీతో రిజిస్ట్రర్ అయిన మల్టీ కమాడిటీ ఎక్స్ చేంజ్(MCX) మాదిరే మార్కెట్ బాక్స్ యాప్ ను నిందితుడు డెవలప్ చేయడం విశేషం. సుమారు 300 మంది ట్రేడర్లు ఈ నకిలీ యాప్ లో రిజిస్ట్రర్ అయి ఉన్నారని పోలీసులు తెలిపారు.

 

ఘరానా ముఠా అరెస్ట్.. రూ.10 కోట్లు స్వాధీనం