Mahesh Bank Hacking: మహేష్ బ్యాంకు హ్యాకింగ్‌ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

ఆయా ఖాతాదారులను పట్టుకుంటే సూత్రధారుల గురించి తెలిసే అవకాశం ఉందని భావించిన దర్యాప్తు అధికారులు.. ఆమేరకు ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించారు.

Mahesh Bank Hacking: మహేష్ బ్యాంకు హ్యాకింగ్‌ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

Mahesh Bank

Mahesh Bank Hacking: తెలంగాణలో సంచలనం కలిగించిన మహేష్ బ్యాంక్ సర్వర్ అకౌంట్ హ్యాకింగ్ కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం ఆధ్వర్యంలో ఈ కేసులో పురోగతి సాధించారు. బ్యాంకు సర్వర్ హ్యాకింగ్ కు సంబంధించి ముందుగా భావిస్తున్న ముగ్గురు ఖాతాదారుల పాత్ర లేదని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించుకున్నారు. బషీర్‌బాగ్‌ బ్రాంచ్‌లో షహనాజ్ పేరుతో అకౌంట్‌ ఓపెన్ చేసిన ఓ మహిళ పాత్రపై ముందు నుంచీ అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు..ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సదరు మహిళకు సంబందించిన ఖాతాలో రూ.6.9 కోట్లు జమ కాగా.. కొద్ది సేపటికే హ్యాకర్లు ఆ నగదును చిన్న మొత్తాల్లో ఇతర ఖాతాలకు మళ్లించారు.

Also read: Corona India: దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు కొత్తగా ఎన్నంటే?

షహనాజ్ బ్యాంకు అకౌంట్ కి లింకై ఉన్న ఫోన్ నెంబర్ కు దర్యాప్తు బృందం ఫోన్ చేయగా.. ఆమె ముంబైలో ఉన్నట్లు గుర్తించారు. హ్యాకింగ్ కు సంబంధించి ఓటీపీ కోసం బ్యాంకు అధికారుల ఫోన్ నంబర్లను మార్చిన కేటుగాళ్లు.. షహనాజ్ నెంబర్ ను మాత్రం మార్చలేదు. ప్రతి లావాదేవీకి సంబంధించిన ఓటీపీ, సమాచారం ఆమె నంబర్‌కు చేరాయి. అయితే షహనాజ్ సహా మరో ముగ్గురి ఖాతాల్లోకి నగదు చేరిందని గ్రహించిన పోలీసులు.. శుక్రవారం వారిని విచారించారు. తమ ఖాతాల్లోకి వచ్చిన నగదు చిన్న మొత్తాల్లో మరో 128 మంది ఖాతాల్లోకి చేరినట్లు ఆ ముగ్గురు ఖాతాదారులు పోలీసులకు వివరించారు. దీంతో హ్యాకింగ్ కు సంబంధించి ఆ ముగ్గురికి ఇటువంటి సంబంధం లేదని నిర్ధారించుకున్నారు.

Also read: Gujarat family death: “అమెరికా కలే” వారికి మృత్యు శాపమైందా? మిస్టరీగా గుజరాత్ ఫ్యామిలీ మరణం

ఈ 4 ఖాతాల నుంచి డబ్బు ఉత్తరాదితో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని 200 మంది ఖాతాల్లోకి వెళ్లినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వాటి నుంచి మరికొన్ని ఖాతాల్లోకి నగదు బదిలీ ఆయినట్లు గుర్తించారు. ఆయా ఖాతాదారులను పట్టుకుంటే సూత్రధారుల గురించి తెలిసే అవకాశం ఉందని భావించిన దర్యాప్తు అధికారులు.. ఆమేరకు ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించారు. బంజారాహిల్స్‌లోని మహేష్ బ్యాంక్ మెయిన్ సర్వర్‌ సంస్థ కార్యాలయానికి వెళ్లి లోతుగా విచారణ చేపట్టడంతో హ్యాకింగ్‌ పై దర్యాప్తు అధికారులకు స్పష్టత వచ్చింది.

మహేష్‌ బ్యాంకు అధికారులు, సర్వర్‌ నిర్వాహకులతో పాటు ముంబై నుంచి వచ్చిన ప్రత్యేక బృందంతో కలిసి సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. హ్యాకర్లు ప్రాక్సీ ఐపీ అడ్రస్‌లు వాడి సర్వర్ లోకి ప్రవేశించారు. ప్రాక్సీ ఐపీ అడ్రస్‌ ద్వారా మొదట సర్వర్‌లోకే ప్రవేశించారని, ఆపై బ్యాంక్‌ నెట్‌వర్క్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్నారని గుర్తించిన పోలీసులు.. దీని వెనుక సైబర్ నిపుణుల ప్రమేయం ఉండి ఉంటుందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

Also read: Somu Veerraju: రాయలసీమ ప్రజలను సోము వీర్రాజు క్షమాపణలు