Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం తన తోబుట్టువులకు, బంధువులకు నెల నెలా రూ.10 లక్షలు పంపాడు: ఈడీ

భారత్ లో ఉన్న తన కుటుంబ సభ్యులు, తోబుట్టువులు, ఇతర బంధువులకు దావూద్ ప్రతి నెలా రూ.10 లక్షలు పంపుతున్నట్టు ఇది అధికారులు గుర్తించారు. ఈ విషయాన్నీ దావూద్ అనుచరుడి మిత్రుడి సోదరుడు ఖలీద్ ఉస్మాన్ షేక్ వెల్లడించాడు

Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం తన తోబుట్టువులకు, బంధువులకు నెల నెలా రూ.10 లక్షలు పంపాడు: ఈడీ

Ed1

Dawood Ibrahim: పాకిస్తాన్ లో తలదాచుకున్న గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం..ఇంకా భారత్ లోని తన కుటుంబ సభ్యులతో టచ్ లోనే ఉన్నాడా? ఏడాదికొకసారి, నెలకొకసారి కాదు..నిత్యం వారితో సంప్రదింపులు జరుపుతున్నాడు దావూద్ ఇబ్రహీం. హవాలా కేసులో..ముంబైలోని.. దావూద్ ఇబ్రహీం, అతని అనుచరుల ఇళ్లలో గత కొన్ని రోజులుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈక్రమంలో దావూద్ సన్నిహితులను, అతని అనుచరులను కొందరిని అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు వారిని విచారిస్తున్నారు. ఈవిచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో బావించినట్టుగా..దావూద్ ఇబ్రహీం..ముంబైలోని తన కుటుంబ సభ్యులతో..అప్పుడప్పుడు కాకుండా..తరచూ వారితో టచ్ లో ఉండేవాడని అధికారులు గుర్తించారు.

other stories:IPL Betting : జనం సొమ్ముతో పోస్టుమాస్టర్ ఐపీఎల్ బెట్టింగ్-కోటి రూపాయల స్వాహా

అంతేకాదు..భారత్ లో ఉన్న తన కుటుంబ సభ్యులు, తోబుట్టువులు, ఇతర బంధువులకు దావూద్ ప్రతి నెలా రూ.10 లక్షలు పంపుతున్నట్టు ఇది అధికారులు గుర్తించారు. ఈ విషయాన్నీ దావూద్ అనుచరుడి మిత్రుడి సోదరుడు ఖలీద్ ఉస్మాన్ షేక్ వెల్లడించాడు. దావూద్ నుంచి ప్రతి నెలా రూ.10 లక్షలు ముంబైలోని అతని తోబుట్టువులకు అందుతున్నట్లు ఖలీద్ ఉస్మాన్ షేక్ ప్రత్యక్షంగా చూశాడు. ఖలీద్ ఉస్మాన్ అన్న అబ్దుల్ సమద్, 1990లో దావూద్ మరియు అరుణ్ గావ్లీ గ్యాంగ్ ల మధ్య జరిగిన ఘర్షణల్లో మృతి చెందాడు. దావూద్ అత్యంత సన్నిహితుడైన ఇక్బాల్ కస్కర్..కు అబ్దుల్ సమద్ చిన్న నాటి స్నేహితుడు. ఈక్రమంలో ఇక్బాల్ కస్కర్ కు హవాలా మార్గంలో దావూద్ నుంచి ప్రతి నెలా రూ.10 అందుతున్నట్లు కూడా ఖలీద్ ఉస్మాన్ షేక్ వెల్లడించాడు.

other storeis:Robbers ‘I LOVE YOU’ Message : ఇల్లంతా దోచేసి..‘ఐ లవ్ యూ’అని రాసిన దొంగలు..

ఇప్పటికే ఇక్బాల్ కస్కర్ ను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు అతన్నుంచి దావూద్ మరియు అతని గ్యాంగ్ సభ్యుల గురించి వివరాలు సేకరిస్తున్నారు. ఇక్బాల్ కస్కర్ గతంలో దుబాయ్ లో ఉండేవాడు. ఆటను ముంబై వచ్చిన ప్రతిసారి ఖలీద్ ఉస్మాన్ షేక్ అతని రెండో సోదరుడు షబ్బీర్ ఉస్మాన్ వెళ్లి కలిసేవారు. అలా కలిసిన ప్రతిసారి వారికీ కొంత డబ్బు ఇచ్చేవాడు ఇక్బాల్. షబ్బీర్ ఉస్మాన్ కూడా డ్రగ్స్ కేసులో అరెస్టయి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అంతేకాకుండా..దావూద్ సోదరి, ఆమె సన్నిహితుడు సలీమ్ పటేల్ గురించి, వారు చేస్తున్న అక్రమాల గురించి కూడా ఖలీద్ ఉస్మాన్ షేక్ ఈడీ అధికారులకు చెప్పాడు.

other stories: Red Sanders : ఐదుగురు స్మగ్లర్లు అరెస్ట్-22 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం

సలీమ్ పటేల్ అసలు పేరు సలీం అహ్మద్ సయ్యద్ అని..దావూద్ సోదరి హసీనా పార్కర్ కు డ్రైవర్ గా పనిచేసిన సలీమ్.. ఆమెతో కలిసి అక్రమ దందాలకు పాల్పడేవాడని ఖలీద్ చెప్పుకొచ్చాడు. హసీనా పార్కర్ దావూద్ పేరు చెప్పుకుంటూ ముంబైలో భూకబ్జాలు, సెటిల్మెంట్ లు చేసినట్లు ఖలీద్ పేర్కొన్నాడు. ముంబైలోని బాంద్రాలో ఖరీదైన ఒక ఫ్లాట్‌ను సలీం పటేల్ మరియు హసీనా పార్కర్ బలవంతంగా లాక్కున్నారు. వారిద్దరూ దోపిడీలు, ఆస్తులను లాక్కోవడానికి దావూద్ ఇబ్రహీం పేరును వాడుకున్నారని సలీం పటేల్ ఒకసారి తనతో చెప్పినట్టు ఖలీద్ ఉస్మాన్ షేక్ ఈడీ అధికారులకు వెల్లడించాడు.