Bengaluru: వృద్ధురాలిని 91సార్లు పొడిచి చంపిన సేల్స్‌మేన్

ఒక ప్రైవేట్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న 29ఏళ్ల వ్యక్తి అతి దారుణంగా 75 సంవత్సరాల వయస్సున్న మహిళను 91సార్లు పొడిచి చంపాడు. స్టాక్ మార్కెట్ లో తాను కోల్పోయిన లక్షలాది రూపాయలను ఆమె నుంచి దోచుకోవాలనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. జైకిషన్ అనే వ్యక్తిని సీకే అచ్చుకట్టు పోలీసులు శనివారం అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

Bengaluru: వృద్ధురాలిని 91సార్లు పొడిచి చంపిన సేల్స్‌మేన్

Landlady Murder

 

 

Bengaluru: ఒక ప్రైవేట్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న 29ఏళ్ల వ్యక్తి అతి దారుణంగా 75 సంవత్సరాల వయస్సున్న మహిళను 91సార్లు పొడిచి చంపాడు. స్టాక్ మార్కెట్ లో తాను కోల్పోయిన లక్షలాది రూపాయలను ఆమె నుంచి దోచుకోవాలనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. జైకిషన్ అనే వ్యక్తిని సీకే అచ్చుకట్టు పోలీసులు శనివారం అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

ఇంటి యజమాని అయిన యశోదమ్మ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుండగా జైకిషన్ అదే బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ లో ఉండేవాడు. కామర్స్ లో డిగ్రీ చదివిన జైకిషన్ డబ్బు సంపాదించడానికి స్టాక్ మార్కెట్ ఎంచుకున్నాడు. ఆన్ లైన్ ట్రేడింగ్ ప్లాట్ ఫాంలలో పెట్టుబడులు పెట్టాడు. ఈ క్రమంలో లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాడు. స్నేహితుల నుంచి రూ.12లక్షలు అప్పుకూడా తీసుకున్నాడు.

చాలామంది డబ్బు తిరిగిచ్చేయమంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. యశోదమ్మ నుంచి కూడా రూ.50వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను హత్య చేసి బంగారపు గొలుసు, నాలుగు గాజులు దొంగింలించాలని ప్లాన్ చేశాడు.

Read Also: ప్రాణం తీసిన పెంపుడు కుక్క..వృద్ధురాలిపై దాడి చేసి చంపేసింది

గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ ప్రదేశంలోనే ఒక గదిలో యశోదమ్మ ఉండేది. ఆమె కొడుకు పిల్లలతో కలిసి వేరే ప్రాంతంలో ఉంటున్నాడు. జులై 2 ఉదయం యశోదమ్మ గదిలోకి ప్రవేశించాడు జైకిషన్. ఆమెను హత్య చేసేందుకు గానూ 91సార్లు కత్తితో పొడిచాడు.

అదే రోజు ఉదయం 9గంటల 30నిమిషాలకు తన తల్లికి హత్యకు గురైందని జైకిషన్ స్వయంగా కాల్ చేసి చెప్పాడు. ఘటనాస్థలానికి వచ్చి చూసేసరికి రక్తపుమడుగులో పడి ఉంది. జైకిషన్ అంబులెన్స్ పిలిచి హాస్పిటల్ కు తీసుకెళ్లేలా చేశాడు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.

హంతుకుడెవరో పట్టుకోవడానికి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) పీ కృష్ణాకాంత్ నేతృత్వంలో ముగ్గురు ఇన్‌స్పెక్టర్లతో స్పెషల్ టీం ఫామ్ అయింది. వందకు పైగా అనుమానితులను విచారించారు.

ముందుగా జైకిషన్ ను అనుమానించని పోలీసులు.. చివరిసారిగా ఎప్పుడు చూశావని ప్రశ్నించడంతో పాటు ఇతర ప్రశ్నలతో దొరికిపోయాడు. మర్డర్ గురించి తెలియగానే చేసిన పనులకు అంతకుముందు ఆమెను చూసినప్పటి విషయాలకు పొంతనలేకుండా ఉంది. అతణ్ని అబ్జర్వేషన్ లో ఉంచిన పోలీసులు ఇన్ఫర్మేషన్ రాబట్టారు. దొంగిలించిన గోల్డ్ ను మృతురాలి కొడుక్కి చూపించగా తల్లిదేనని కన్ఫామ్ చేశాడు.