లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

బాలుడికి లింగ మార్పిడి- కొన్నేళ్లుగా అత్యాచారం చేస్తున్న నకిలీ హిజ్రాలు

Updated On - 7:32 pm, Sat, 16 January 21

13 Year Old Boy Forced to Have Sex Change, Raped by 6 Men For Years, Case Filed : ఢిల్లీలో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలుడికి మాయమాటలు చెప్పి లింగమార్పిడి చేయించి…కొన్నేళ్లుగా అత్యాచారం చేస్తన్న హిజ్రా వేషగాళ్ల ఉదంతం వెలుగు చూసింది. ఢిల్లీ మహిళా కమీషన్ కు ఫిర్యాదు అందటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గీతానగర్ కు చెందిన బాలుడు సమీపంలోని లక్ష్మీనగర్ లో జరుగుతున్న ఓ డ్యాన్స్ కార్యక్రమం చూడటానికి వెళ్ళాడు. అమ్మాయిల వేషంలో కొందరు కుర్రాళ్లు అక్కడ డాన్య్ చేశారు. కార్యక్రమం అయిన తర్వాత బాలుడు డ్యాన్స్ చేసిన వారిని కలిసాడు. వాళ్లు బాలుడిపై కన్నేశారు. మాతో వస్తే డ్యాన్స్ నేర్పిస్తామని చెప్పారు. ఓకే, అన్నాడు బాలుడు అమాయకంగా. మండవలి ప్రాంతానికి రమ్మని చెప్పి వాళ్లు వెళ్లిపోయారు.

తర్వాత కాలంలో మండవలి వెళ్లి వారిని కలిసి డాన్స్ నేర్చుకోవటం మొదలెట్టాడు. అలా వచ్చివెళుతున్నబాలుడికి వారు అప్పుడప్పుడు కొంత మొత్తం డబ్బులు ఇవ్వటం మొదలెట్టారు. బాగా డ్యాన్స్ నేర్చుకుంటే డబ్బులు సంపాదించవచ్చని హాయిగా జీవించవచ్చని ఆశ చూపించారు. ఆ మాటలకు ఆకర్షితుడైన బాలుడు వారి వద్దకు వెళ్లి డ్యాన్స్ నేర్చుకోవటం కొనసాగించాడు.

క్రమేపి వారు బాలుడికి మత్తు పదార్ధాలు అలవాటు చేశారు. కొన్నాళ్లకు లింగమార్పిడి ఆపరేషన్ చేయించారు. హార్మోన్ టాబ్లెట్ల్ వాడించారు. అతి తక్కువ కాలంలోనే బాలుడు అమ్మాయిలాగా మారిపోయాడు. శరీరంలో మార్పులు వచ్చాయి. అప్పటి నుంచి వాళ్లు బాలుడిపై లైంగిక దాడి చేయటం ప్రారంభించారు.

విటులను తీసుకువచ్చి వారితో వ్యభిచారం చేయించారు. అమ్మాయిలాగా మారిన తర్వాత నుంచి ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర బిచ్చమెత్తాలని బలవంతం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించాడు. ఎవరైనా ఒంటరిగా వెళుతుంటే వారిపై దాడి చేసి దోచుకోవాలవి వత్తిడి చేసేవారని చెప్పాడు. తమకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చంపేస్తామని, మీ కుటుంబ సభ్యులకు కూడా హాని తలపెడతామని బెదిరించారు.

వారికి భయపడిన బాలుడు సమయం కోసం వేచి చూసి…. గతేడాది మార్చిలో వారినుంచి ఎలాగోలా తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు. తన తల్లికి జరిగిన విషయం అంతా వివరించాడు. అయితే బాలుడ్ని వెతుక్కుంటూ వచ్చిన నిందితులు, బాలుడ్ని తీసుకెళ్లి మళ్లీ అత్యాచారం చేశారు.

వారి బాధలు భరిస్తున్నబాలుడు కొన్నాళ్లకు, అక్కడే ఉన్న మరో స్నేహితుడితో కలిసి తప్పించుకుని ఢిల్లీ రైల్వే స్టేషన్ కు చేరుకున్నాడు. అక్కడ ఒక రోజంతా దాక్కున్నారు. వీరిని చూసిన ఒక న్యాయవాది చేరదీశాడు. వారిని ఢిల్లీ మహిళా కమీషన్ వద్దకు తీసుకువెళ్లాడు.

అక్కడ బాధితుడు తన గోడు వెళ్లబోసుకున్నాడు. మహిళా కమీషన్ ఆదేశాలతో పోలీసులు నిందితులపై పోక్సోలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. బాధిత బాలురిద్దరినీ పునరావాస కేంద్రానికి తరలించారు. వారి రక్షణకు ఏర్పాట్లు చేయనున్నట్లు మహిళా కమీషన్ తెలిపింది.