Delhi Cop Threaten : పెళ్లి చేసుకోవాలని వేధించి, బెదిరించిన కానిస్టేబుల్‌పై కేసు నమోదు

ఢిల్లీకి చెందిన కానిస్టేబులు తనతో పాటు పని చేసే మహిళా కానిస్టేబుల్ ను పెళ్లి చేసుకోవాలని వేధించాడు.

10TV Telugu News

Delhi Cop Threaten : ఢిల్లీకి చెందిన కానిస్టేబులు తనతో పాటు పని చేసే మహిళా కానిస్టేబుల్ ను పెళ్లి చేసుకోవాలని వేధించాడు. ఆమె అతడిప్రతిపాదన తిరస్కరించేసరికి ఆమెకుటుంబసభ్యులతో సహా అందరినీ చంపేస్తాననిబెదిరించాడు. దీంతో బాధితులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఉత్తర‌ప్రదేశ్ లోని బులంద్‌షహర్‌ జిల్లాలోని కాకోడ్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. యూపీ కే చెందిన మరోక యువతి ఢిల్లీలో పోలీసు కానిస్టేబుల్ గా ఎంపికయ్యింది. ఇద్దరూ ఒకే పోలీసు స్టేషన్ లో పని చేయచటంతో కానిస్టేబుల్ ఆమె‌పై మనసు పారేసుకున్నాడు.

ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేశాడు. అందుకు ఆమె అభ్యంతరం చెప్పింది. తన తల్లితండ్రులు చూపించిన సంబంధాన్నే చేసుకుంటానని అతని పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించింది. ఈలోగా ఆమె విధుల్లో భాగంగా మొరాదాబాద్ శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ కు వెళ్లింది. నిందితుడైన కానిస్టేబుల్ అక్కడకు  వెళ్లి ఆమెను పెళ్లి చేసుకోమని వేధించసాగాడు. మళ్లీ ఆమె పాత పాటే పాడింది. తన తల్లి తండ్రులు చూపించిన సంబంధమే చేసుకుంటానని స్పష్టం చేసింది.

Also Read : COVID Antibodies : నాలుగు నెలల్లోనే తగ్గుతున్న యాంటీ బాడీలు

నిందితుడైన కానిస్టేబుల్ ఆమె ఇంటికి వెళ్లి, వారి కూతురుని తనకిచ్చి పెళ్లి చేయమని తల్లితండ్రులను అడిగాడు. అందుకు వారు కూడా అభ్యంతరం చెప్పారు. దీంతో కోపోద్రిక్తుడైన కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్ పై వేధింపులు మరింత పెంచాడు.  తనను తప్ప ఇంకెవర్నీ పెళ్లి చేసుకోటానికి వీల్లేదంటూ హుకుం జారీచేశాడు.

నన్ను కాదని ఇంకోకర్ని ఎలా పెళ్లి చేసుకుంటావో చూస్తా అని బెదిరించాడు. వేరోకరితో మీ కూతురు పెళ్లి చేస్తే అందర్నీ చంపేస్తానని ఆమె తల్లి తండ్రులను భయబ్రాంతులకు గురిచేశాడు. బాధిత మహిళా కానిస్టేబుల్ కుటుంబం చోళ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నిందితుడు పోలీసు కానిస్టేబుల్ కావటంతో అతడి నుంచి రక్షణ కల్పించాలని కోరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Sai Dharam Tej : యాక్సిడెంట్ కేసు.. రూ.లక్ష ఫైన్ వేసిన జీహెచ్ఎంసీ

10TV Telugu News