Honey Trap From Facebook : ఫేస్‌బుక్‌లో అమ్మాయిల పేరుతో వలపు వల…

ఫేస్‌బుక్‌లో   యువతుల పేరుతో   ఫేక్ ఎకౌంట్లు క్రియేట్ చేసి  వాటి ద్వారా బ్లాక్ మెయిలింగ్ కు  పాల్పడుతూ డబ్బులు కాజేస్తున్న   ముఠా సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Honey Trap From Facebook : ఫేస్‌బుక్‌లో అమ్మాయిల పేరుతో వలపు వల…

Honey Trap From Facebook : ఫేస్‌బుక్‌లో   యువతుల పేరుతో   ఫేక్ ఎకౌంట్లు క్రియేట్ చేసి  వాటి ద్వారా బ్లాక్ మెయిలింగ్ కు  పాల్పడుతూ డబ్బులు కాజేస్తున్న   ముఠా సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.  ఢిల్లీ పోలీసులు అందించిన సమాచారం   ప్రకారం బాధితుడి ఫేస్‌బుక్ ఎకౌంట్‌కు  ఒక మహిళ నుంచి  ఫ్రెండ్  రిక్వెస్ట్  వచ్చింది.  దానిని అతడు కన్‌ఫర్మ్ చేసి స్నేహితుడిగా చేసుకున్నాడు.

అప్పటి నుంచి ఇద్దరూ  మెసెంజర్ లో చాటింగ్ చేసుకోవటం మొదలెట్టారు. కాలక్రమంలో  ఒకరి వాట్సప్ నెంబర్ ఒకరు ఎక్సెంజ్ చేసుకున్నారు.  అనంతరం బాధితుడికి అవతలి వైపు నుంచి అభ్యంతరకరమైన కంటెంట్ తో  వీడియో కాల్ వచ్చింది.  ఆ కాల్ అటెండ్  చేశాడు.  కొన్నాళ్లకు అదే నెంబర్ నుంచి అంతకు ముందు తాను లిఫ్ట్ చేసిన అభ్యంతరకరమైన కంటెంట్ వీడియో వచ్చింది.

అందులో బాధితుడు అభ్యంతరకరమైన దృశ్యాలను చూస్తున్నట్లు ఉంది.  ఈ వీడియోను ఇంటర్నెట్ లో అప్ లోడ్  చేయకుండా ఉండాలంటే డబ్బులివ్వాలని  అవతలి వ్యక్తి  డబ్బు  డిమాండ్ చేశాడు. భయపడిన బాధితుడు  అతను కోరినట్లు రూ.1,96,000 చెల్లించాడు.  అనంతరం బాధితుడు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Also Read : Nepali Couple Loot A House : పని మనుషులుగా చేరి రూ.85 లక్షలు దోచేసిన నేపాలి దంపతులు

కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి  దిగి దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడికి వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా దర్యాప్తు చేయగా ఆ నెంబర్ రాజస్థాన్ లోని భరత్ పూర్ జిల్లాకు చెందిన  హక్ముద్దీన్  గా తెలుసుకుని అతడ్ని అరెస్ట్ చేశారు.   నిందితుడు   ఇచ్చిన సమాచారంతో ఈ ముఠాకు చెందిన మరో   ముగ్గురి కోసం పోలీసులు  గాలిస్తున్నారు. ఈ ముఠా ఫేస్ బుక్ లో అమ్మాయిల పేరుతో ఫేక్ ఎకౌంట్లు క్రియేట్ చేసి బాధితులను నిండా ముంచుతూ మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.