ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం : ఫ్యాక్టరీకి అనుమతి లేదా ? 

  • Published By: madhu ,Published On : December 8, 2019 / 05:42 AM IST
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం : ఫ్యాక్టరీకి అనుమతి లేదా ? 

ఢిల్లీలోని ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండలిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 44 మంది చెందారు. 22 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొంతమంది ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీకి అనుమతి లేదని అధికారులు వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది. నివాసాల మధ్య ఉన్న ఆ భవనంలో అక్రమంగా ప్లాస్టిక్ వస్తువులను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. స్కూల్‌ బ్యాగ్స్‌, వాటర్‌ బాటిళ్లు భారీగా నిల్వ చేశారు. అసలు ప్రమాద సమయంలో భవనంలో ఎంతమంది ఉన్నారనేదానిపై స్పష్టత లేదు. పైగా బాగా ఇరుకైన ప్రాంతంలో ఉండటంతో సహాయచర్యలకూ ఇబ్బంది కలిగింది. 

మృతుల్లో చాలా మంది పొగతో ఊపిరాడక చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే సంఘటనాస్థలికి అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది చేరుకున్నారు. మొత్తం 30 ఫైరింజన్లతో మంటలను ఆర్పారు. సమీపంలో నివాసాలు..ఇతర భవనాలు ఉండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మంటలు వ్యాపించకుండా..ఫైర్ సిబ్బంది నిలువరించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. 

అంబులెన్స్, ఫైరింజన్లు సకాలంలో అక్కడకు చేరుకున్నా..క్షతగాత్రులను సమయానికి ఆస్పత్రులకు తరలించలేకపోయాయి. మార్కెట్ ఏరియా మొత్తం ట్రాఫిక్ స్తంభించింది. 
ఎలాంటి అనుమతి లేకుండా ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నట్లు సమాచారం. భవనానికి సంబంధించిన యజమాని అందుబాటు లేకుండా పోయారు. 
Read More : ఢిల్లీలో బతుకులు బుగ్గి : పెరుగుతున్న మృతుల సంఖ్య