Earrings Snatching : పుట్టినరోజు జరుపుకోవటానికి చెవి రింగులు దొంగతనం చేసిన ఇంజనీర్

ఢిల్లీలోని మానస సరోవర్ పార్క్ వద్ద మహిళ చెవిరింగులు దొంగిలించిన కేసులో ఒక జూనియర్ ఇంజనీర్‌(31)ను పోలీసులు అరెస్ట్ చేశారు, దొంగతనం చేయటానికి ఆఇంజనీర్ చెప్పిన కారణం విని పోలీసులు విస్తుపోయారు.

10TV Telugu News

Earrings Snatching : ఢిల్లీలోని మానస సరోవర్ పార్క్ వద్ద మహిళ చెవిరింగులు దొంగిలించిన కేసులో ఒక జూనియర్ ఇంజనీర్‌(31)ను పోలీసులు అరెస్ట్ చేశారు, దొంగతనం చేయటానికి ఆఇంజనీర్ చెప్పిన కారణం విని పోలీసులు విస్తుపోయారు.

ఢిల్లీలోని షాహాదారాలోని జ్యోతి‌నగర్‌లో నివసించే మోహిత్ గౌతమ్ అలియాస్ లవ్ బీఎస్ఈఎస్ లో ఔట్ సోర్సింగ్ పద్దతిలో జూనియర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. జులై 25 ఆదివారం తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలనుకున్నాడు. జేబులో పర్సు చూస్తే ఖాళీగా ఉంది. నెలాఖరు రోజులు. డబ్బులు లేవు. అయినా సరే పుట్టినరోజు జరుపుకోవాలి అనుకున్నాడు. డబ్బులు కావాలి… ఏం చేయాలో అతనికి పాలుపోలేదు. దొంగతనం చేయాలి అనుకున్నాడు.

అందుకని మానస సరోవర్ పార్క్ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. జులై 23 శుక్రవారం పార్క్ దగ్గరకు వెళ్లాడు. అక్కడకు బైక్‌పై వచ్చిన మహిళ చెవికి ఉన్న రింగులు తీసుకుని పరారయ్యాడు. వెంటనే మహిళ స్ధానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మొత్తం 30 సీసీటీవీల ఫుటేజి పరిశీలించారు. బాధితురాలు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం కొంత మందిని ఐడెంటిఫై చేశారు. అందులో ఒక వ్యక్తిని ఆమె గుర్తించింది. ముఖానికి మాస్క్ వేసుకుని.. ఆ వ్యక్తి నడిపిన బైక్‌కు ముందు వెనుక నెంబర్ ప్లేట్ లేదు. బైక్ మోడల్, కంపెనీ, రంగు ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టారు.

ఆ బైక్ ఎటునుంచి ఎటువెళ్లిందనేది కనిపెట్టిన పోలీసులు జగత్‌పురిలో నిఘాపెట్టారు. ఆఏరియాలో నిఘాపెట్టిన పోలీసులకు వైన్ షాపు వద్దకు మద్యం కొనుక్కోటానికి వచ్చిన గౌతమ్ దొరికిపోయాడు. అతని బండికి నెంబర్ ప్లేట్ లేక పోవటం… బైక్ మోడల్‌తో సహా పోలీసులు అతడ్ని గుర్తించి అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

విచారణలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోటానికి చెవిరింగులు దొంగతనం చేసినట్లు జూనియర్ ఇంజనీర్ గౌతమ్ ఒప్పుకున్నాడు. చెవి రింగులను అశోక్ నగర్‌లోని సురేందర్‌కు అమ్మినట్లు చెప్పాడు. సురేందర్‌ను పట్టుకోటానికి పోలీసులు ప్రయత్నించగా…. విషయం తెలిసిన అతను అప్పటికే పరారీలో ఉన్నాడు

10TV Telugu News