కథ అడ్డం తిరిగింది, చెల్లి పెళ్లి డబ్బు కోసం కిడ్నాప్ డ్రామా, సల్మాన్ అరెస్ట్

  • Published By: naveen ,Published On : July 7, 2020 / 12:04 PM IST
కథ అడ్డం తిరిగింది, చెల్లి పెళ్లి డబ్బు కోసం కిడ్నాప్ డ్రామా, సల్మాన్ అరెస్ట్

కథ అడ్డం తిరిగింది. ప్లాన్ బెడిసికొట్టింది. డబ్బు చేతికి అందకపోగా జైలు పాలయ్యాడు. చెల్లి పెళ్లి డబ్బు కోసం కిడ్నాప్ డ్రామా ఆడిన వ్యక్తి కటకటాల పాలయ్యాడు. పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కేవలం 2 గంటల్లోనే కేసుని చేధించారు పోలీసులు. కిడ్నాప్ డ్రామా ఆడిన వ్యక్తిని పోలీసులు జైలుకి తరలించారు. దేశ రాజధాని ఢిల్లీలోని వజీరాబాద్ లో ఈ ఘటన జరిగింది. అతడి పేరు సల్మాన్. వయసు 24 ఏళ్లు. పేద కుటుంబం. సల్మాన్ కు ఓ చెల్లి ఉంది. ఆమెకి పెళ్లి చేయాలని అనుకున్నాడు. అయితే సల్మాన్ దగ్గర అంత డబ్బు లేదు. ఎలాగైనా చెల్లి వివాహం జరిపించాలని డిసైడ్ అయిన సల్మాన్ కిడ్నాప్ స్కెచ్ వేశాడు.

Corona virus positive for 2557 police men in maharastra

అంకుల్ నుంచి డబ్బు రాబట్టేందుకు:
ఈ క్రమంలో సల్మాన్ కన్ను తన బంధువు అయిన అంకుల్ ముదాసిర్ పైన పడింది. ముదాసిర్ బాగా డబ్బున్న వ్యక్తి. ఎలాగైనా అతడి నుంచి డబ్బు సంపాదించాలకున్నాడు. ఇందులో భాగంగా కిడ్నాప్ డ్రామాకి తెరలేపాడు. తాను కిడ్నాప్ అయ్యానని, తనను ఓ రూమ్ లో బంధించారని సల్మాన్ తన సోదరుడికి ఫోన్ చేశాడు. తనను క్షేమంగా వదిలేయాలంటే కిడ్నాపర్లు రూ.5లక్షలు డిమాండ్ చేస్తున్నారని చెప్పాడు. కంగారు పడిన సల్మాన్ సోదరుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. పలు బృందాలుగా రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్స్ కోసం గాలించడం మొదలు పెట్టారు. సెల్ ఫోన్స్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు సల్మాన్ ఉంటున్న ప్రాంతాన్ని గుర్తించారు. అక్కడికి వెళ్లి చూడగా అక్కడ ఎవరూ లేరు. ఆ తర్వాత సల్మాన్ ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. పోలీసులు స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. దీంతో సల్మాన్ బండారం మొత్తం బయటపడింది. అక్కడ సల్మాన్ తప్ప మరెవరూ లేరు. దీంతో సల్మాన్ కిడ్నాప్ డ్రామా ఆడినట్టు వారికి అర్థమైపోయింది. ఆ తర్వాత పోలీసులు సల్మాన్ ని కనిపెట్టి పట్టుకున్నారు. తమదైన స్టైల్ లో విచారించారు.

అడ్డంగా దొరికిపోయిన సల్మాన్:
తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తాను కిడ్నాప్ డ్రామా ఆడినట్టు సల్మాన్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ఎందుకిలా చేశావు అని అడిగితే, తన చెల్లి పెళ్లి డబ్బు కోసం అని చెప్పాడు. తన అంకుల్ ముదాసిర్ బాగా డబ్బున్న వ్యక్తి అని, తాను కిడ్నాప్ అయినట్టు తెలిస్తే తనను విడిపించుకోవడానికి ఆయన రూ.5లక్షలు ఇచ్చేవాడని పోలీసులతో చెప్పాడు. తాను తన సోదరుడికి ఫోన్ చేసి తాను కిడ్నాప్ అయినట్టు చెబితే, అతడు అంకుల్ ముదాసిర్ కు ఫోన్ చేసి విషయం చెప్పి రూ.5లక్షలు ఇప్పించుకునే వాడని సల్మాన్ వివరించాడు. అయితే కథం అడ్డం తిరిగింది. సల్మాన్ కిడ్నాప్ డ్రామాకు తెరపడింది. సల్మాన్ ను రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికిపోయాడు. కటకటాల పాలయ్యాడు.

Read Here>>అత్యాచార నిందితుడికి కరోనా..60మంది పోలీసులు క్వారంటైన్ కి