అర్జున్ రెడ్డి ఇన్స్పిరేషన్ తో అమ్మాయిలకు వల

  • Published By: murthy ,Published On : May 30, 2020 / 07:20 AM IST
అర్జున్ రెడ్డి ఇన్స్పిరేషన్ తో అమ్మాయిలకు వల

బాలీవుడ్ మూవీ కబీర్ సింగ్ (తెలుగు అర్జున్ రెడ్డి) సినిమా ఇన్స్పిరేషన్ తో  తానో డాక్టర్నని చెప్పి యువతులను మోసం చేస్తున్న 31 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతడి చేతిలో మోసపోయిన   ఓ డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో  పోలీసులు అతడ్ని అరెస్టు చేయటంతో గుట్టు రట్టైంది.

ఢిల్లీకి చెందిన ఆనందకుమార్ (31) అనే వ్యక్తి కబీర్ సింగ్ సినిమా లోని ఆర్థోపెడిక్ సర్జన్ షాహిద్ కపూర్ పాత్రతో స్పూర్తి పొందాడు.  తానో ఆర్థో పెడిక్  సర్జన్నని చెప్పుకుంటూ  సోషల్ మీడియా యాప్ టిండర్ డేటింగ్ లో డాక్టర్. రోహిత్ గుజరాల్ అనే మారు పేరుతో ప్రోఫైల్ క్రియేట్ చేశాడు. ఆ  యాప్ ద్వారా అమాయక యువతులకు వల వేసి వారితో చాటింగ్ మొదలు పెట్టేవాడు. ఈక్రమంలో అతడి వలలో ఓ డాక్టర్ చిక్కింది.

ఇద్దరి మధ్య చాటింగ్ మొదలైంది. ఆమెను పెళ్లి చేసుకుంటానని కుమార్ నమ్మబలికాడు. అడడిని పూర్తిగా నమ్మిన సదరు యువతి రూ.30 వేల రూపాయలు అతడి ఎకౌంట్ కు ట్రాన్సఫర్ చేసింది. కొద్దిరోజుల తర్వాత  ఆ యువతికి ఆనంద్ కుమార్ ప్రవర్తనపై అనుమానం వచ్చి ప్రశ్నించగా  ఆమెను బెదిరించటం మొదలెట్టాడు.

ఆమెకు చెందిన ప్రయివేటు చిత్రాలు, వీడియోలు బయట పెడతానని సోషల్ మీడియాలో  పోస్ట్ చేస్తానని బెదిరించ సాగాడు.  దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్నపోలీసులు ఆనంద్ తో  పాటు అతడికి సహకరిస్తున్న మరోక యువకుడ్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 

Read: లాక్ డౌన్ లో ఇంటికి వచ్చిన కూతురిపై తండ్రి అత్యాచారం