వైరల్‌గా మారిన మెట్రో ట్రైన్ సూసైడ్

వైరల్‌గా మారిన మెట్రో ట్రైన్ సూసైడ్

రైలు సర్వీస్, ఎంఎంటీస్ ట్రైన్ల కిందపడి చేసుకుంటున్న ఆత్మహత్యలు చూస్తూనే ఉన్నాం. ట్రాఫిక్‌ను అధిగమించాలనే ఆలోచనతో వచ్చిన మెట్రో ట్రైన్‌లు కూడా ఆత్మహత్యలు చేసుకునేందుకు వేదికలుగా మారాయి. కొద్ది రోజులుగా ఓ వ్యక్తి మెట్రో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో హైదరాబాద్ మెట్రో స్టేషన్లో జరిగిందంటూ చక్కర్లు కొడుతున్నాయి. 

ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు. ఈ ఘటన ఢిల్లీలోని టాగూర్ గార్డెన్ వద్ద ఆగష్టు 16న రాత్రి 11గంటల సమయంలో జరిగింది. నజఫ్‌ఘర్ వక్తి అయిన రాహుల్(27) ట్రైన్ కోసం ఎదురుచూసి సెకన్ల వేగంతో దాని ముందుకు వంగి నడుం వరకూ ట్రైన్ ముందు పెట్టి చనిపోయాడు. ఈ సంఘటన అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డు అయింది. 

శుక్రవారం పోలీసులకు టాగూర్ గార్డెన్ మెట్రో స్టేషన్లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం అందించారు. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు డీడీయూ మార్చురీకి మృతదేహాన్ని తరలించారు. ఆ బ్లూ లైన్ సర్వీస్ నైరుతి ఢిల్లీ నుంచి నోయిడాలోని ఎలక్ట్రానిక్ సిటీని కలుపుతోంది. అదే రోజు ఉదయం 25ఏళ్ల మహిళ ఆదర్శ నగర్ మెట్రో స్టేషన్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

Read More :  ఊటీలో హైటెన్షన్ : ప్రతి ఇంటికి వెళ్లి ప్రశ్నిస్తున్నారు